Begin typing your search above and press return to search.

'సిస్టమ్' పైనే అన్నపూర్ణ 2.0 ఫోకస్.. కొత్త జనరేషన్ కనెక్ట్ అయితేనే..

ముఖ్యంగా కొత్త దర్శకులు, కొత్త నటులు, కొత్త కథల విషయంలో అన్నపూర్ణ తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

By:  M Prashanth   |   7 Sept 2026 11:12 AM IST
సిస్టమ్ పైనే అన్నపూర్ణ 2.0 ఫోకస్.. కొత్త జనరేషన్ కనెక్ట్ అయితేనే..
X

టాలీవుడ్‌ లో అన్నపూర్ణ స్టూడియోస్‌ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలు, భారీ చిత్రాలు, అక్కినేని కుటుంబంతో ముడిపడిన సినిమాలతో ఆ సంస్థకు స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు సినిమా బిజినెస్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల టేస్టులు మారాయి. ముఖ్యంగా కొత్త జెనరేషన్ ఆడియన్స్ మూవీ విషయంలో క్యాస్టింగ్ కంటే కంటెంట్, మేకింగ్, ప్రమోషన్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్‌ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ కూడా తన గేమ్ ప్లాన్‌ ను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇదే ఇప్పుడు అన్నపూర్ణ 2.0 అనే ఆలోచనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా.. మొత్తం సిస్టమ్‌ ను బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టడం కీలకంగా మారింది. ప్రొడక్షన్‌ తో పాటు డిస్ట్రిబ్యూషన్, పోస్ట్ ప్రొడక్షన్ కొత్త టెక్నాలజీ, కొత్త టాలెంట్‌ కు అవకాశాలు.. ఇలా పలు విషయాల్లో తన ఎగ్జ్సిటెన్స్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటుంది.

ముఖ్యంగా కొత్త దర్శకులు, కొత్త నటులు, కొత్త కథల విషయంలో అన్నపూర్ణ తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి పెద్ద స్టార్‌ తో సినిమా చేయడం మాత్రమే విజయానికి హామీ ఇవ్వడం లేదు. చిన్న పాయింట్‌ తో వచ్చిన సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తున్నాయి. అందుకే కొత్త ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నపూర్ణకు కీలకంగా మారొచ్చు.

ఇక్కడ మరో పెద్ద సవాల్ ఉంది. అన్నపూర్ణ అనే పేరుకు పాత తరం ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపును కొత్త జెనరేషన్ ప్రేక్షకులకు కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లాలి. ప్రస్తుత జనరేషన్‌కు ఒక బేనర్ చరిత్ర కంటే.. అది ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తోందన్నదే ముఖ్యం. కాబట్టి అన్నపూర్ణ బ్రాండ్‌ ను కొత్త ఆడియన్స్‌ తో కనెక్ట్ చేయాలంటే స్టోరీల సెలక్షన్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతిదీ కొత్త జెనరేషన్ కు తగ్గట్టుగా ఉండాలి.

అదే సమయంలో ఫ్యామిలీ హీరోలకే పరిమితం కాకుండా ఇతర హీరోలు, కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడం కూడా సంస్థకు ఉపయోగపడొచ్చు. దీనివల్ల కొత్త మార్కెట్లు, కొత్త ఆడియన్స్ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిడ్ బడ్జెట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు సరైన ప్లాట్‌ ఫామ్‌ గా అన్నపూర్ణ మారితే.. దాని బ్రాండ్ వాల్యూ మరోసారి పెరిగే అవకాశం ఉంది.

అయితే అన్నపూర్ణ 2.0 విజయానికి అసలు పరీక్ష మాత్రం ప్రేక్షకులే. అప్పటి బ్రాండ్, హిస్టరీ మాత్రమే కాకుండా.. నేటి ప్రేక్షకుడికి నచ్చే కథలు, కొత్త టాలెంట్ తో ముందుకెళ్లగలిగితేనే కొత్త జర్నీకి అర్థం ఉంటుంది. రీసెంట్ గా కొన్ని సినిమాలతో నిరాశ ఎదురైనా.. అన్నపూర్ణకు ఇప్పుడు హీరోల కంటే సిస్టమ్, కంటెంట్, కొత్త జెనరేషన్ ఆడియన్స్ కీలకం. వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితేనే.. కొత్త జెనరేషన్ కు ఫేవరెట్ బ్యానర్‌ గా మారే ఛాన్స్ ఉందని చెప్పాలి.