ఓటీటీ మారితో వివాదం మర్చిపోతారా?
లేడీ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `అన్నపూర్ణి-ది గాడెస్ ఆఫ్ పుడ్` రెండేళ్ల క్రితం రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Srikanth Kontham | 1 Oct 2025 2:00 AM ISTలేడీ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `అన్నపూర్ణి-ది గాడెస్ ఆఫ్ పుడ్` రెండేళ్ల క్రితం రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. శ్రీరాముడిని కించపరిచే విధంగా సంభాషణలున్నాయని.. లవ్ జిహాద్ ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ దేశ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తుందని తక్షణమే సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలని..చిత్ర యూనిట్ పైఊ చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. పొలిటికల్ పార్టీ శివసేన కూడా ఈవివాదంలోకి ఎంటర్ అయింది.
ఆ పార్టీ పోలీసులకు సినిమా పై ఫిర్యాదు చేసింది. దీంతో మరిన్ని రాజకీయ పార్టీలు సీన్ లోకి వచ్చాయి. సినిమాను రాజకీయం చేసే ప్రయత్నం చేసాయి. దీంతో నెట్ ప్లిక్స్ ఉన్నపళంగా అన్నపూర్ణి చిత్రాన్ని తొలిగించింది. ఈనేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు నయనతారకు అండగా నిలబడ్డారు. అయినప్పటికీ వివాదం నేపథ్యంలో నయన్ సహా చిత్ర యూనిట్ దిగొచ్చి క్షమాపణలు తెలిపింది. దీంతో సమస్య తొలగిందనుకుంటోన్న సమయంలో? నయన్ వ్యక్తిగతంగా టార్గెట్ అయింది.
పాత్రలో భాగంగా నయన్ నాన్ వెజ్ వంటకాలు చేయడం తో ఓవర్గం మనోభావాలు దెబ్బ తీసిన నటిగానూ ఫోకస్ అయింది. సోషల్ మీడియా వేదికగా నయనతారను ఓ వర్గం పనిగట్టుకుని విమర్శించింది. పెద్ద ఎత్తున ట్రోల్ సారు. తాజాగా ఈ చిత్రం రెండేళ్ల అనంతరం జియో హాట్ స్టార్ లో రీ-రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుం ది. రిలీజ్ కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉండటంతో? మళ్లీ ఆ పాత వివాదం తెరపైకి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో మళ్లీ ఎటాకింగ్ జరిగితే గనుక నయన్ మళ్లీ దొరికినట్లే. కొన్ని కొన్ని పరిస్థితులు తదుపరి రిలీజ్ పై కూడా ప్రభావం చూపిస్తుంటాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చడ్డా` రిలీజ్ సమయంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నాడు. ఆ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా? జనాల్లోకి బోయ్ కట్ ట్రెండ్ అన్నది వెళ్లిందంటే? ఎంతటి వారైనా దిగి రావాల్సిందే.
