Begin typing your search above and press return to search.

'పెద్ది' టీమ్‌కు అన్నా లెజినోవా సర్‌ప్రైజ్ విషెస్.. పిక్స్ వైరల్!

రామ్ చరణ్‌తో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేస్తూ, సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.ఆ వివరాలు ఇలా వున్నాయి..

By:  Madhu Reddy   |   3 Jun 2026 2:37 PM IST
పెద్ది టీమ్‌కు అన్నా లెజినోవా సర్‌ప్రైజ్ విషెస్.. పిక్స్ వైరల్!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' . రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చిత్ర యూనిట్‌కు, రామ్ చరణ్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్‌తో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేస్తూ, సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.ఆ వివరాలు ఇలా వున్నాయి..




చరణ్‌తో పిక్.. ఉదయాన్నే అత్తమ్మతో అన్నా లెజినోవా సందడి:

అన్నా లెజినోవా కేవలం 'పెద్ది' టీమ్‌కు విషెస్ చెప్పడమే కాకుండా, సోషల్ మీడియాలో కొన్ని రేర్ పిక్చర్స్ షేర్ చేశారు. ఉదయాన్నే పవన్ కల్యాణ్, అలాగే ఆయన తల్లి అంజనా దేవి గారితో కలిసి దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ బాండింగ్‌ను చూపిస్తున్న ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.




అంచనాలు పెంచేస్తున్న బుచ్చిబాబు సనా మ్యాజిక్:

'ఉప్పెన' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో, ఒక భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని టాలీవుడ్‌లో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.




పవన్ కల్యాణ్ స్పెషల్ వీడియో:

మరోవైపు పవన్ కల్యాణ్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి 'పెద్ది' సినిమాకు తన సపోర్ట్ అందించారు. ఈ సినిమా ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు రాకూడదని, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించి, ఘన విజయం సాధించాలని పవన్ ఆకాంక్షించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.




మెగా ఫ్యామిలీ నుంచి అందుతున్న ఈ వరుస అప్‌డేట్స్, బ్లెస్సింగ్స్‌తో 'పెద్ది' సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయింది. ఇక అన్నా లెజినోవా స్వీట్ గెస్టర్, పవన్ కల్యాణ్ వీడియో సందేశం సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రేపు థియేటర్లలో చరణ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.