Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై భయ‌ప‌డిన భార్య‌!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఓ సంచలనం.

By:  Srikanth Kontham   |   13 Jun 2026 2:45 PM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై భయ‌ప‌డిన భార్య‌!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఓ సంచలనం. అయితే? ఆయన ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నప్పుడు.. ఆయన కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన, ఆందోళనల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కొణిదెల తన భర్త పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను అనుభవించిన వ్యక్తిగత భావోద్వేగాలను తొలిసారి పంచు కున్నారు. `పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించినప్పుడు ఎంతో భయపడ్డానని.. మానసికంగా ఒంటరితనానికి గురయ్యానన‌న్నారు.

విదేశీ మూలాలున్న తనకు ఇక్కడి రాజకీయ వాతావరణం, ప్రజా ప్రవాహం, ఎదురయ్యే సవాళ్లు మొదట్లో తీవ్ర ఆందోళన కలిగించాయన్నారు. సాధారణ కుటుంబ జీవితం నుండి ఒక్కసారిగా రాజకీయ ఒత్తిడి ఉన్న వాతావరణంలోకి మారడం పెద్ద సవాలుగా మారిందన్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ జనసేన నాయకులు, మెగా కుటుంబ సభ్యులు , ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఆదరించిన తీరు ఆ భయాన్ని పోగొట్టిందని అన్నా లెజ్నెవా తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం పడుతున్న కష్టాన్ని, ఆయన ఆశయాలను చూసిన తర్వాత ఒక భార్యగా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

కుటుంబం ఇచ్చిన ధైర్యంతోనే తాను కూడా రాజకీయ వాతావరణానికి అలవాటు పడగలిగానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, విమర్శలు సహజమని.. వాటన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎంతో సంయమనంతో ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆయన పట్టుదల, సమాజ మార్పు కోసం పడే తపనే తమ కుటుం బానికి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందన్నారు. ప్ర‌స్తుతం ఏపీ ప్రజల ఆశీస్సులతో ప‌వ‌న్ కీలకమైన బాధ్యతలో ఉన్నారని, ప్రజలకు సేవ చేయాలనే ఆయన కల నెరవేరు తున్నందుకు భార్యగా ఎంతో గర్వంగా ఉందని అన్నా లెజ్నెవా తెలిపారు.

ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత మెగా కుటుంబంలో జరిగిన వేడుకలలో అన్నా లెజ్నెవా సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి నివా సంలో జరిగిన కుటుంబ వేడుకల నుండి ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఆమె పవన్ కళ్యాణ్ సరసన నిలిచి తన మద్దతును చాటారు. విదేశీయురాలిగా కాకుండా కొణిదెల కుటుంబ కోడలిగా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె వ్యవహరిస్తున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.