Begin typing your search above and press return to search.

అన్నా కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీపై పవన్, చిరూ రియాక్ష‌న్ ఏంటంటే?

ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 March 2026 5:56 PM IST
అన్నా కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీపై పవన్, చిరూ రియాక్ష‌న్ ఏంటంటే?
X

ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు పూర్తిగా లో ప్రొఫైల్‌లోనే కొనసాగిన ఆమె, స‌డ‌న్ గా ఇన్‌స్టాగ్ర‌మ్ లోకి రావడం చాలామందికి సర్‌ప్రైజ్‌గా అనిపించింది. ఇప్పుడే ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చార‌నే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన మార్పులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప‌బ్లిక్ లైమ్‌లైట్ కి దూరంగా అన్నా

గత కొన్నేళ్లుగా అన్నా కొణిదెల తన పిల్లల చ‌దువు కోసం సింగపూర్‌లోనే ఉన్నారు. ఫ్యామిలీకి ప్రాధాన్యతనిస్తూ, పబ్లిక్ లైమ్‌లైట్‌కి దూరంగా ఉన్న ఆమె, తాజాగా ఆమె ఇండియాకు తిరిగి వ‌చ్చి, ఫ్యామిలీతో క‌లిసి జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా కనెక్ట్ కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెస్పాన్స్

అయితే అన్నా సోష‌ల్ మీడియా ఎంట్రీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. భార్య సోషల్ మీడియా ప్రయాణాన్ని హృదయపూర్వకంగా స్వాగతించిన ప‌వ‌న్.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెల్‌క‌మ్.. ఈ జ‌ర్నీ మ‌రింత అర్థ‌వంతంగా ఉండాల‌ని కోరుకుంటున్నానంటూ.. అన్నా డెసిష‌న్ కు త‌న మ‌ద్ద‌తును తెలియ‌చేశారు. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ విధంగా ఓపెన్‌గా స్పందించడం, ఈ విషయాన్ని మరింత హైలైట్ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటూ మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నా సోష‌ల్ మీడియా ఎంట్రీ పై స్పందిస్తూ ఆమెను స్వాగ‌తించారు.

ఇప్పటివరకు మీడియా దూరంగా ఉండే అన్నా, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఫ్యూచ‌ర్ లో ఆమె సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. మ‌రో ఆసక్తికర విష‌యం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి రావడం, పబ్లిక్ ఇమేజ్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పాలిటికల్ లీడర్స్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇప్పుడు సాధారణ ట్రెండ్‌గా మారుతున్న వేళ, అన్నా ఎంట్రీ కూడా అదే దిశగా ఒక అడుగు అని చెప్పవచ్చు. ఇక ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియా వర్గాల్లో కూడా ఈ పరిణామం మంచి స్పందనను తెచ్చుకుంది. ఆమె అకౌంట్ ప్రారంభించిన వెంటనే ఫాలోవర్స్ సంఖ్య వేగంగా పెరుగుతుండటం గమనార్హం.