Begin typing your search above and press return to search.

అన్నా కొణిదెల ఎమోషన్ షేర్.. చిరంజీవిపై హృదయానికి హత్తుకునే మాటలు!

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన అన్నయ్యపై ఉన్న ప్రేమాభిమానాలను సుదీర్ఘ సందేశం ద్వారా పంచుకున్నారు.

By:  Madhu Reddy   |   22 Aug 2026 1:30 PM IST
అన్నా కొణిదెల ఎమోషన్ షేర్.. చిరంజీవిపై హృదయానికి హత్తుకునే మాటలు!
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, కొణిదెల కుటుంబం కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ ప్రత్యేక సందర్భంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమ కుటుంబంలో చిరంజీవి గారు వహించే పాత్ర ఎంతటి విశిష్టమైనదో తెలుపుతూ ఆయనపై ఉన్న అపారమైన గౌరవాన్ని, ప్రేమాభిమానాలను ఆమె ఎంతో సున్నితంగా పంచుకుని అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

కుటుంబానికి జ్ఞాన భాండాగారం:

అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ఉన్న అరుదైన ఫోటోను షేర్ చేశారు. మా కుటుంబానికి చిరంజీవి గారు కేవలం పెద్దవారు కాదు.. ఆయన జ్ఞానం, ప్రేమ, బాధ్యతలతో అందరికీ మార్గదర్శకం.ఇక మా కుటుంబంలో ప్రతి ఒక్కరం ఆయనను చూసే క్రమశిక్షణను నేర్చుకుంటాం. ఏ చిన్న సలహా కావాలన్నా మేమంతా మొదట సంప్రదించేది ఆయన్నే" అంటూ చిరంజీవి గారిపై తనకున్న గౌరవాన్ని ఎంతో ప్రేమగా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం:

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన అన్నయ్యపై ఉన్న ప్రేమాభిమానాలను సుదీర్ఘ సందేశం ద్వారా పంచుకున్నారు. "అన్నయ్యను గుర్తు చేసుకుంటే నాకు ఎప్పుడూ సంతోషం కలుగుతుంది. ఇక ఆయన కేవలం కుటుంబాన్ని మాత్రమే కాకుండా బంధువులను, స్నేహితులను, చలనచిత్ర రంగాన్ని వెలిగించారు. సౌత్, నార్త్ సినిమాల మధ్య ఒక సాంస్కృతిక వారధిలా నిలిచారు" అని పవన్ కల్యాణ్ కొనియాడారు.

విశ్రమించనిది ఆయన శ్రమ:

సూపర్ స్టాడమ్ నుంచి పద్మవిభూషణ్ వరకు ఎన్నో పురస్కారాలు సాధించినా ఆయన ఎప్పుడూ విశ్రమించరని పవన్ తెలిపారు. ఇటీవల వెన్నుముకకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ, అతి తక్కువ సమయంలోనే స్ట్రెంత్ ట్రైనింగ్‌తో మళ్లీ కోలుకుని సెట్స్‌పైకి వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇక ఆయనలో ఆపలేని ఒక మోటార్ ఉందనడానికి ఇదే నిదర్శనమని చెబుతూ, కోట్ల మందికి ఆయన 'మెగాస్టార్' అయితే, తనకు మాత్రం 'ఒకే ఒక్క హీరో' అని పవన్ స్పష్టం చేశారు.

అన్నా కొణిదెలతో పాటు పవన్ కల్యాణ్ పంచుకున్న ఈ అనుబంధం, చిరంజీవి గారు కుటుంబంలో ఎంతటి గొప్ప స్థానాన్ని ఆక్రమించారో చాటిచెబుతోంది. సినీ రంగానికే కాకుండా కొణిదెల కుటుంబానికి కొండంత అండగా నిలిచిన చిరంజీవి గారికి ప్రకృతి ఆయురారోగ్యాలను, అపారమైన విజయాలను ప్రసాదించాలని అభిమానులంతా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు..