Begin typing your search above and press return to search.

కంటెంట్ రిచ్ 'బ్యూటీ'.. పెయిడ్ ప్రీమియర్స్ ఎక్కడెక్కడంటే?

సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నారు. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా వేయనున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ప్రదర్శించనున్నారు.

By:  M Prashanth   |   17 Sept 2025 10:26 PM IST
కంటెంట్ రిచ్ బ్యూటీ.. పెయిడ్ ప్రీమియర్స్ ఎక్కడెక్కడంటే?
X

సూపర్ హిట్ ఆయ్ మూవీ ఫేమ్, యంగ్ హీరో అంకిత్ కొయ్య ఇప్పుడు లీడ్ రోల్ లో బ్యూటీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నీలఖి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.

గీత సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ప్రాజెక్టులతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ధన్.. ఇప్పుడు బ్యూటీ మూవీని ప్రేమ, కుటుంబ విలువలు, తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ ఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న బ్యూటీ మూవీ.. ఇప్పుడు సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేశారు.

సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నారు. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా వేయనున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ ను తాజాగా ఓపెన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. అవి ఎక్కడంటే?

1.పీవీఆర్ నెక్సస్, హైదరాబాద్

2.సీఎంఆర్ ఐనాక్స్, వైజాగ్

3.ఎన్వీఆర్ జైశ్యామ్, తిరుపతి

4.ఐనాక్స్ ఎల్ఈపీఎల్, విజయవాడ

5. స్పైస్ సినిమాస్, నెల్లూరు

ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే సినిమాలో నరేష్, వాసుకి, నందా గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీఎస్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు సాయి కుమార్ చూసుకుండగా, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ తోపాటు సాంగ్స్ అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మరి కంటెంట్ రిచ్ మూవీలా అనిపిస్తున్న బ్యూటీ.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.