Begin typing your search above and press return to search.

లిప్ లాక్ కు సిగ్గుపడ్డ హీరో.. 12సార్లు ప్రాక్టీస్ చేశాడట

సినిమాలో కిస్ సీన్ ను హీరో 12సార్లు ప్రాక్టీస్ చేశాడని చెప్పారు బ్యూటీ చిత్రం దర్శకుడుు జేఎస్ఎస్ వర్థన్.

By:  M Prashanth   |   18 Sept 2025 10:00 PM IST
లిప్ లాక్ కు సిగ్గుపడ్డ హీరో.. 12సార్లు ప్రాక్టీస్ చేశాడట
X

సినిమాలో కిస్ సీన్ ను హీరో 12సార్లు ప్రాక్టీస్ చేశాడని చెప్పారు బ్యూటీ చిత్రం దర్శకుడుు జేఎస్ఎస్ వర్థన్. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా బ్యూటీ. ఇది జీ స్టూడియో, వానరా సెల్యూ లాయిడ్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందింది. ఇందులో అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.

రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఎండిగ్ లో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. అయితే ఆ సీన్ కు హీరో చాలా సిగ్గుపడ్డాడని డైరెక్టర్ వర్థన్ అన్నారు. చాలా అ సౌకర్యంగా ఫీల్ అయ్యాడని చెప్పాుడు. అందుకే ఆ సీన్ ను కేవలం ఒకేసారి చేస్తానని హీరో చెప్పాడట. అంతేకాకుండా ఈ సీన్ ను ఆయన చెయ్యి అడ్డు పెట్టుకొని 12సార్లు ప్రాక్టీస్ చేశాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ వెల్లడించాడు.

సినిమాలో కిస్ సీన్ ఉంది. దాన్ని హీరో ఒకేసారి చేస్తా అన్నాడు. అంతేకాకుండా ఆ సీన్ ను దాదాపు 12సార్లు ప్రాక్టీస్ చేశాడు. చేసిన ప్రతీసారీ, హీరోయిన్ కు కంఫర్ట్ ఉండాలని చెయ్యి అడ్డుపెట్టుకొని ప్రాక్టీస్ చేశాడు. ఆమె మాత్రం వణికిపోయింది. కానీ ఆమెను సౌకర్యంగా ఉంచుతూనే.. ఇబ్బంది కలగకుండా చేశాడు. ఆ తర్వాత లైటింగ్, కెమెరా అన్ని ఓకేనా అని అడిగేవాడు. అంటే ఈ సీన్ ను ఒక్క టేక్ లోనే చెయ్యాలని అతను ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడు.

మాకు కూడా అది సినిమాలో మూమెంట్ షాట్. అందుకే సెన్సార్ వాళ్లు కూడా కట్ చేయలేదు. అనుకున్నట్లే ఆ సీన్ ఒక్క షాట్ లోనే వచ్చింది. అయితే నేను ఇంకో టేక్ అని అడగ్గానే అతను నన్ను ఏమీ అనలేక.. నావైపు కోపంగా చూశాడు. అని లిప్ లాక్ సీన్ షూటింగ్ గురించి డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

యుత్ ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. మధ్య తరగతి తండ్రీ- కుతుళ్ల మధ్య అనుబంధం, యువ జంట ప్రేమ కథ నేపథ్యంలో కథ ఉండనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. తన సినిమాపై దర్శకుడు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొందరు ఈ సినిమాను బేబీ, కోర్టు చిత్రాల మాదిరిగా ఉందని ప్రశంసిస్తున్నారని చెప్పారు.