Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ గా సీత‌మ్మ ని దించుతున్నారా?

అంజ‌లి అలియాస్ సీత‌మ్మ కోలీవుడ్, టాలీవుడ్ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డ అవ‌కాశాలు వ‌స్తే అక్క‌డ ప‌ని చేసుకుంటూ వెళ్లిపోతుంది

By:  Srikanth Kontham   |   23 Aug 2025 1:44 PM IST
సెంటిమెంట్ గా సీత‌మ్మ ని  దించుతున్నారా?
X

అంజ‌లి అలియాస్ సీత‌మ్మ కోలీవుడ్, టాలీవుడ్ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డ అవ‌కాశాలు వ‌స్తే అక్క‌డ ప‌ని చేసుకుంటూ వెళ్లిపోతుంది. కొంత కాలంగా రెండు భాష‌ల్ని తెలివిగా బ్యాలె న్స్ చేసుకుంటూ వ‌స్తోంది. కెరీర్ ఆరంభంలో అటు పోట్లు ఎదురైనా అటుపై అమ్మ‌డు నిల‌దొక్కుకోవ‌డంతో కెరీర్ సాపీగా సాగిపోతుంది. న‌టిగా వ‌చ్చిన గుర్తింపుతో అవ‌కాశాలు అరుదుగా వ‌చ్చినా? మంచి పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. తాజాగా అంజ‌లి మ‌రో స్టార్ హీరోతో ఛాన్స్ అందుకుంది.

మెయిన్ లీడ్ నే డామినేట్ చేస్తుందా:

విశాల్ హీరోగా 35వ చిత్రం ఇటీవ‌ల ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ కిది 99వ చిత్రం కావ‌డంతో ర‌వి అర‌సు ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగానూ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ గా మెయిన్ లీడ్ కు దుషార విజ‌య‌న్ న‌టిస్తోంది. తాజాగా సెకెండ్ లీడ్ కు తెలుగు హీరోయిన్ అంజ‌లిని ఎంపిక చేసారు. దీంతో ఫోక‌స్ అంతా అంజ‌లిపై మ‌ళ్లింది. మెయిన్ లీడ్ దుషార అయినా? రెండు భాష‌ల్లో అంజ‌లి కి ఉన్న క్రేజ్ తో ఆమె మెయిన్ లీడ్ అన్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం మొద‌లైపోయింది. దుషార డామినేట్ చేస్తుందంటూ నెట్టింట పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

హిట్ సెంటిమెంట్:

విశాల్ గ‌త చిత్రం `మ‌ద‌గ‌జ‌రాజా` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అందులో అంజ‌లి న‌టిం చింది. పైగా ఆ సినిమా ప‌దేళ్ల క్రితం నాటి చిత్రం. అప్పుడు పూర్త‌యిన చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. 60 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డం అన్న‌ది ఏమాత్రం ఊహించ‌ని చిత్రంగా మారింది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో అదే తొలి సినిమా . ఈ నేప‌త్యంలోనే స‌క్స‌స్ కి సెంటిమెంట్ గా అంజ లిని తీసుకున్నారనే ప్ర‌చారం షురూ అయింది.

రెండింటా అదే ఆస‌క్తి:

`మదగజరాజా`కు ప‌ని చేసిన రిచర్డ్ ఎం. నాధన్ సినిమాటోగ్రాఫర్ గా కొత్త సినిమాకు ఎంపిక చేసారు. అలాగే విశాల్ న‌టించిన `మార్క్ ఆంటోనీ`కి మ్యూజిక్ అందించిన జీవి ప్ర‌కాష్ నే 35వ సినిమాకు సంగీతం అంది స్తున్నారు. ఇలా విశాల్ గత సినిమాల్లో స‌క్స‌స్ అయిన వారంద‌ర్నీ త‌న 35వ సినిమాకు ఎంపిక చేయ డంతో? అంజ‌లి ఎంట్రీ అంద‌రికంటే కీల‌కంగా మారింది. సినిమాకు అమెను ల‌క్కీ ఛామ్ గా భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అంజ‌లి త‌మిళ సినిమాల‌తోనే బిజీగా ఉంది. `ప‌రాంతు పో`, `ఈగై` చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగులో కొత్త అవ‌కాశాలు కోసం తాను చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేస్తోంది.