Begin typing your search above and press return to search.

'స‌య్యారా' బ్యూటీ రిస్కీ డెసిష‌న్?

డెబ్యూ న‌టీమ‌ణుల‌కు చాలా ప్ర‌యోగాలు చేయాల‌నే కోరిక‌ ఉండొచ్చు. సెల‌క్టివ్ గా ముందుకు సాగాల‌నే ఉచిత స‌ల‌హాలు ఇచ్చేవాళ్లుంటారు.

By:  Sivaji Kontham   |   28 Aug 2025 3:00 AM IST
స‌య్యారా బ్యూటీ రిస్కీ డెసిష‌న్?
X

డెబ్యూ న‌టీమ‌ణుల‌కు చాలా ప్ర‌యోగాలు చేయాల‌నే కోరిక‌ ఉండొచ్చు. సెల‌క్టివ్ గా ముందుకు సాగాల‌నే ఉచిత స‌ల‌హాలు ఇచ్చేవాళ్లుంటారు. కానీ అన్ని సంద‌ర్భాల్లో అంద‌రికీ ఇవి వ‌ర్తించ‌వు. కొన్నిసార్లు రాజీ ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవాల్సి రావొచ్చు. అలాంటి ప‌రిస్థితిలో స‌య్యారా బ్యూటీ అనీత్ ప‌ద్ధా కూడా ఉన్నారా? అంటే అవున‌నే తాజా ప‌రిణామం చెబుతోంది.

న‌టించిన మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌నం సృష్టించిన ఈ అందాల యువ‌క‌థానాయిక త‌దుప‌రి ఒక పెద్ద ద‌ర్శ‌కుడితో అగ్ర బ్యాన‌ర్ లో ప‌ని చేయ‌డానికి సిద్ధ‌మవుతోంది. టైగ‌ర్ 3 లాంటి భారీ ఫ్లాప్ సినిమాని తెర‌కెక్కించిన మ‌నీష్ శ‌ర్మ తిరిగి త‌న శుద్ దేశీ రొమాన్స్ జాన‌ర్ కి షిఫ్ట్ అవుతున్నాడు. అత‌డు తన కెరీర్ తొలి నాళ్ల‌లో రూపొందించిన బ్యాండ్ బాజా బ‌రాత్, శుద్ దేశీ రొమాన్స్ త‌ర‌హాలో ఇప్పుడు ఒక రొమాంటిక్ కామెడీని తెర‌కెక్కించేందుకు అత‌డు స‌న్నాహ‌కాల‌లో ఉన్నాడు. ఈ సినిమా కోసం స‌య్యారా బ్యూటీ అనీత్ ప‌ద్దాను ఎంపిక చేయ‌డం అత‌డికి పెద్ద ప్ల‌స్ కానుంది.

అయితే ఒక పెద్ద ఫ్లాప్‌ని ఎదుర్కొన్న ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం నిజానికి అనీత్ ప‌ద్ధాకు కెరీర్ ప‌రంగా పెద్ద మైనస్. కానీ అత‌డు తిరిగి త‌న పాత జాన‌ర్ కి వ‌చ్చి పెద్ద హిట్టిస్తాడ‌నే హోప్ కూడా లేక‌పోలేదు. అందుకే వైఆర్ఎఫ్ సంస్థ కూడా తిరిగి అత‌డిపై పెట్టుబ‌డులు పెడుతోంది. అనీత్ ప‌ద్ధా ప్ర‌స్తుతం య‌ష్ రాజ్ ఫిలింస్ రేంజు, ఫేమ్ గురించి ఆలోచిస్తోంది. ఇంత పెద్ద నిర్మాణ సంస్థ‌లో అవ‌కాశాన్ని కాద‌న‌లేని స్థితిలో ఉంది. ప్ర‌స్తుతం వెంట‌ప‌డుతున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నో చెప్పే స్థాయి త‌న‌ది కాదు. అందుకే త‌న రెండో ప్ర‌య‌త్నం ఎలా ఉండ‌బోతోందో వేచి చూడాలి.

అనీత్ ప‌ద్ధా- అహాన్ పాండే జంట‌గా న‌టించిన స‌య్యారా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 350 కోట్లు వ‌సూలు చేసింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది.