Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్స్ ను సైతం వ‌ద‌ల‌డం లేదా?

సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక‌ వేధింపుల అంశం నిత్యం తెర‌పైకి వ‌స్తోన్న అంశ‌మే. ఇప్ప‌టికే ఎంతో మంది న‌టీమణులు కాస్టింగ్ కౌచ్ ను ఉద్దేశించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   31 May 2026 8:00 PM IST
స్టార్ కిడ్స్ ను సైతం వ‌ద‌ల‌డం లేదా?
X

సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక‌ వేధింపుల అంశం నిత్యం తెర‌పైకి వ‌స్తోన్న అంశ‌మే. ఇప్ప‌టికే ఎంతో మంది న‌టీమణులు కాస్టింగ్ కౌచ్ ను ఉద్దేశించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చే వారి విష‌యంలో ఇలాంటి దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతాయ‌ని అంటుంటారు. అయితే ఇలాంటి వాటిలో స్టార్ కిడ్స్ కూడా అతీంతం కాద‌ని ఓ సీనియ‌ర్ న‌టి ఆరోపిస్తోంది. ఇటీవల సీనియర్ నటి అనితా కన్వర్ తన కుమార్తె పూజా కన్వర్ ఎదుర్కొన్న ఇలాంటి భయంకరమైన అనుభవాన్ని పంచుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అనితా కన్వర్ కుమార్తె పూజా కన్వర్ కూడా షోబిజ్ ప్రపంచంలో ఇలాంటి అసంబద్ధమైన డిమాండ్లను ఎదుర్కొని మానసికంగా పూర్తిగా కుంగిపోయిందన్నారు. ఆ గ్లామర్ రంగంపై ఉన్న గౌరవం ఒక్కసారిగా పోయి, తాను నమ్ముకున్న కళా ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? అని ఊహించలేకపోయానంది. ఈ సంఘటన త‌న‌ను ఎంతగానో భయపెట్టింద‌న్నారు. తన కుమార్తె పడుతున్న మానసిక వేదనను చూసి చలించిపోయిన అనితా కన్వర్ ఆ సమయంలో ఒక తల్లిగా అత్యంత కఠినమైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. సొంత నటనా ప్రస్థానం అత్యున్నత దశలో ఉన్నా? కీర్తి ప్రతిష్టల కంటే తన బిడ్డ మానసిక ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ఆమె భావించారు.

ఇందుకోసం విజయవంతమైన కెరీర్‌ను త్యాగం చేసి కూతురికి అండగా నిలబడటానికి పరిశ్రమ నుండి పూర్తిగా వైదొలిగిన‌ట్లు చెప్పుకొచ్చారు. పరిశ్రమలో ఒంటరిగా పోరాడే నటీనటులకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కానీ పూజకు ఆమె తల్లి అనితా కన్వర్ రూపంలో బలమైన రక్షణ కవచం లభించింది. ఒక తల్లి తన కెరీర్‌ను సైతం పక్కనబెట్టి అండగా నిలవడం వల్ల, పూజ ఆ మానసిక క్షోభ నుండి త్వరగా కోలుకోగలిగింది.

సెలబ్రిటీల జీవితాల్లో బాహ్య ప్రపంచానికి కనిపించే విజయాల కంటే కుటుంబ సభ్యుల ఇచ్చే నైతిక మద్దతు ఎంత కీలకమో ఈ సంఘటన నిరూపిస్తుంది. చిత్ర పరిశ్రమలో కాలక్రమేణా ఎన్నో మార్పులు వస్తున్నా? క్యాస్టింగ్ కౌచ్ డిమాండ్ల సంస్కృతి ఇంకా పూర్తిగా సమూలంగా నశించలేదనడానికి ఇలాంటి ఆవేదనలే సాక్ష్యం. ఎంతో ప్రతిభ ఉండి, కష్టపడి పైకి రావాలనుకునే మహిళలను ఒక వస్తువులా చూసే ధోరణి ఇంకా కొనసాగుతుండటం విచారకరం. `మీటూ` వంటి ఉద్యమాలు వచ్చినప్పటికీ తెర వెనుక జరిగే ఇలాంటి సంఘ‌ట‌ల‌ను అరికట్టడానికి మరింత కఠినమైన వ్యవస్థాగత మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.