`సయ్యారా` బ్యూటీ సమంత అంత పెద్ద స్టార్ అవుతుందా?
అయితే సమంతను అనుకరిస్తోందనే ముద్ర పడితే.. తనకంటూ ఒక వోన్ స్టైల్ క్రియేట్ చేసుకోలేదనే అపవాదు ఎదురవుతుంది.
By: Sivaji Kontham | 19 Feb 2026 10:03 AM ISTచాలా మంది నటవారసులకు లేని అవకాశం అదృష్టం ఈ అమ్మడికి దక్కాయి. నటించిన మొదటి సినిమానే ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకూ భారతదేశంలో వచ్చిన అన్ని ప్రేమకథా చిత్రాల రికార్డులను ఇది తిరగరాసింది. ఇలాంటి గొప్ప డెబ్యూ అవకాశం అందరికీ రాదు! అంటూ కితాబు అందుకుంది. ఈ నటి మరెవరో కాదు.. అహాన్ పాండే సరసన `సయ్యారా` చిత్రంలో నటించిన అనీత్ పద్దా. నటించిన మొదటి సినిమానే సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
అనీత్ పద్దా తదుపరి టాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. `సయ్యారా`లో అద్భుత నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కోసం అన్ని పరిశ్రమల దర్శకనిర్మాతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇక అనీత్ పద్దాలో సమంత ఛాయలు ఉన్నాయన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
అనీత్ పద్దా సమంత అంతటి స్టార్ అవుతుందా? అనేది అటుంచితే, సమంతకు `ఏ మాయ చేసావే` ఎలాగో, అనీత్ పద్దాకు కూడా తన మొదటి సినిమా `సయ్యారా`తో మంచి పేరు వచ్చింది. అందం, అభినయం రెండూ ఉండటం వల్ల ఆడియన్స్ అనీత్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే స్టార్ హీరోయిన్ సమంతతో పోల్చడం వల్ల అనీత్‌కు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. ఇది కెరీర్ ఆరంభంలో మంచి బూస్ట్ ఇస్తుంది. అయితే ఇలా పోలిక చూడటం అంత మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. టాలీవుడ్ ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత డ్రెస్సింగ్ సెన్స్ ని అనీత్ పద్దా కూడా అనుసరిస్తుండటం వల్లనే ఇలాంటి ప్రచారం జరుగుతోంది.
అయితే సమంతను అనుకరిస్తోందనే ముద్ర పడితే.. తనకంటూ ఒక వోన్ స్టైల్ క్రియేట్ చేసుకోలేదనే అపవాదు ఎదురవుతుంది. సమంత తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని నిర్మించుకుంది కాబట్టే నేడు సౌత్ ఇండియాలో టాప్ స్టార్‌గా నిలిచింది. అదే తరహాలో అనీత్ పద్దా తన స్పెషాలిటీ గ్రాఫ్ ని తనే నిర్మించుకోవాల్సి ఉంటుంది.
అయితే తాజాగా అనీత్ పద్దా బ్లాక్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది. అల్ట్రా పోష్ సూట్ లుక్ లో అదరగొట్టింది. ఈ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వోగ్ ఈవెంట్ లో అనీత్ ఇలా కనిపించింది. గతంలో ఇదే వోగ్ కవర్ పేజీపై సమంత బ్లాక్ లుక్ తో జోడించి అనీత్ పద్దా లుక్ ని కూడా అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు.
ఫ్యాషన్ సెన్స్ బాగానే ఉంది.. దీంతో పాటే, అనీత్ పద్దాకు స్టార్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ సమంత స్థాయికి చేరాలంటే కేవలం పోలికలు మాత్రమే సరిపోవు.. సరైన కథల ఎంపిక, నిలకడ చాలా ముఖ్యం. సమంత కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆమె కేవలం గ్లామర్ మీద మాత్రమే ఆధారపడలేదు, `రంగస్థలం`, `మహానటి`, `ఫ్యామిలీ మ్యాన్` వంటి సినిమాలతో తన నటనను నిరూపించుకుంది. అనీత్ కూడా అదే బాటలో నడిస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.
అనీత్ పద్దా తదుపరి సినిమాల విషయానికి వస్తే ..మడాక్ ఫిలింస్ `శక్తి శాలిని` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే యష్ రాజ్ ఫిలింస్ (YRF) నిర్మాణంలో మనీష్ శర్మ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ డ్రామాలో కూడా నటించబోతోంది. ఫాతిమా సనా షేక్, అర్జున్ మాథుర్‌లతో కలిసి `న్యాయ` అనే కోర్ట్ రూమ్ డ్రామాలో నటిస్తోంది.
