Begin typing your search above and press return to search.

తమిళంలో కొత్త మ్యూజిక్ స్టార్మ్… అనిరుధ్‌కు గట్టి పోటీ తప్పదా ?

తమిళ సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్లుగా మారి అద్భుతాలు సృష్టించారు జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్. ముఖ్యంగా అనిరుధ్ అయితే ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు.

By:  Madhu Reddy   |   1 July 2026 11:00 PM IST
తమిళంలో కొత్త మ్యూజిక్ స్టార్మ్… అనిరుధ్‌కు గట్టి పోటీ తప్పదా ?
X

తమిళ సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్లుగా మారి అద్భుతాలు సృష్టించారు జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్. ముఖ్యంగా అనిరుధ్ అయితే ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. అయితే, ఇప్పుడు కోలీవుడ్‌లో అనిరుధ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒక కొత్త మ్యూజిక్ తుఫాన్ దూసుకొస్తోంది. కేవలం 20 ఏళ్లు కూడా నిండకుండానే సాయి అభ్యంకర్ అనే కుర్రాడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అనిరుధ్ రేంజ్‌ను దాటేలా సాయి అభ్యంకర్:

ప్రస్తుతం ఇండియా మొత్తం అనిరుధ్ మ్యూజిక్ మేనియాతో ఊగిపోతోంది. అతన్ని కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పట్లో రాడు అనుకుంటున్న తరుణంలో సాయి అభ్యంకర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక 'డ్యూడ్', 'కరుప్పు' వంటి సినిమాలతో తన టాలెంట్ ఏంటో చూపించిన ఈ కుర్రాడు.. ఆ చిత్రాలు రిలీజ్ కాకముందే ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాప్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా'లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఛాన్స్ కొట్టేసి సంచలనం సృష్టించాడు.

లైన్‌లో ఉన్న టాప్ హీరోల సినిమాలు:

సాయి అభ్యంకర్ క్రేజ్ కేవలం ఒక్క సినిమాతోనే ఆగలేదు. రీసెంట్‌గా సూర్య, టి.జి.జ్ఞానవేల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలిమ్స్ అనౌన్స్ చేసిన భారీ చిత్రానికి ఈయనే సంగీతం అందిస్తున్నాడు. ఇక దీనితో పాటు ధనుష్ నటిస్తున్న 'ఓం' అలాగే శింబు కొత్త చిత్రానికి కూడా అభ్యంకరే మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఖరారయ్యాడు. కెరీర్ ఆరంభంలోనే ఇంతమంది స్టార్ హీరోల సినిమాలు దక్కించుకోవడం టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

లోకేష్ కనకరాజ్ ఎల్సీయూ లోకి ఎంట్రీ:

సాయి అభ్యంకర్ ఖాతాలో పడిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. లోకేష్ కనకరాజ్ సినిమా. లారెన్స్ హీరోగా లోకేష్ కనకరాజ్ తన పాపులర్ ఎల్సీయూ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న సినిమాకు అభ్యంకరే మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇక అనిరుధ్ హోల్డ్ ఎక్కువగా ఉండే లోకేష్ సినిమాలోనే ఈ కుర్రాడికి ఛాన్స్ రావడం విశేషం. ఇవే కాకుండా కార్తి, శివకార్తికేయన్, విజయ్ సేతుపతిల రాబోయే చిత్రాలకు కూడా అభ్యంకర్ సైన్ చేసినట్లు సమాచారం.

అనిరుధ్‌కు సాధ్యం కాని రికార్డ్:

నిజానికి అనిరుధ్ తన కెరీర్ మొదట్లో ఇంత తక్కువ టైంలో ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకోలేదు. కానీ, సాయి అభ్యంకర్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టాప్ ప్రొడక్షన్ హౌసెస్, స్టార్ డైరెక్టర్ల మనసు గెలుచుకున్నాడు. ఇక రాబోయే ఈ భారీ చిత్రాలన్నింటికీ గనక ఈ కుర్రాడు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే.. అనిరుధ్ స్థానానికి గట్టి పోటీ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

సంగీత ప్రపంచంలో ఎప్పుడూ ఒకే రకమైన ట్రెండ్ నడవదు. అనిరుధ్ సృష్టించిన సునామీని తట్టుకుని నిలబడటం ఎవరికైనా కష్టమే. కానీ, 20 ఏళ్ల సాయి అభ్యంకర్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే సౌత్ ఇండియాలో మరో కొత్త మ్యూజిక్ ఐకాన్ రెడీ అయిపోయాడని క్లియర్‌గా అర్థమవుతోంది. మరి ఈ యంగ్ సెన్సేషన్ తన పాటలతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.