Begin typing your search above and press return to search.

అనిరుధ్‌తో యంగ్ సెన్సేష‌న్‌ సై అంటే సై!

యువ సంగీత సంచ‌ల‌నం సాయి అభ్యంక‌ర్‌.. వ‌రుస క్రేజీ బీజిఎమ్స్‌తో స్టార్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తున్న అనిరుధ్ క్రేజీ ప్రాజెక్ట్‌ల విష‌యంలో పోటీప‌డుతున్నారు.

By:  Ravindar Gorantla   |   17 March 2026 5:00 AM IST
అనిరుధ్‌తో యంగ్ సెన్సేష‌న్‌ సై అంటే సై!
X

యువ సంగీత సంచ‌ల‌నం సాయి అభ్యంక‌ర్‌.. వ‌రుస క్రేజీ బీజిఎమ్స్‌తో స్టార్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తున్న అనిరుధ్ క్రేజీ ప్రాజెక్ట్‌ల విష‌యంలో పోటీప‌డుతున్నారు. ఈ ఇద్ద‌రి నేప‌థ్యం ఒక్క‌టే అదే ఇండిపెండెంట్ మ్యూజిక్‌. వై దిల్ కొల‌వెరి` సాంగ్‌లో అనిరుధ్‌ సంల‌చ‌నం సృష్టించ‌గా, సాయి అభ్యంక‌ర్ `క‌చ్చి సేరా` ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో యువ‌త‌ని ఉర్రూత‌లూగించాడు. అనిరుధ్ `3` మూవీతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేయ‌గా అందులో ధ‌నుష్ పాడిన `వై దిల్ కొల‌వెరి డీ` వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించి అనిరుధ్‌ని టాప్‌లో నిల‌బెట్టింది.

ఆ త‌రువాత చిన్న చిన్న సినిమాల‌తో ప్ర‌యాణం మొద‌లు పెట్టి త‌న‌దైన మార్కు మ్యూజిక్‌ని క్రియేట్ చేస్తూ స్టార్ హీరోల వాంటెడ్ లిస్ట్‌లో చేరిపోయాడు. సాంగ్స్‌కు మించి హీరో ఎలివేష‌న్ బిజీఎమ్స్‌ని అందించ‌డంతో దిట్ట‌గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ ఇప్పుడు రూ.25 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం అనిరుధ్ చేతిలో `జ‌న నాయ‌గ‌న్‌`తో క‌లిపి మొత్తం ప‌ద‌కొండు సినిమాలున్నాయి. అవ‌న్నీ క్రేజీ ప్రాజెక్ట్‌లే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా విఘ్నేష్ శివ‌న్ రూపొందిస్తున్న ల‌వ్ ఇన్సూరెన్స్ కంప‌నీ చేస్తున్నాడు.

దీనితో పాటు గౌత‌మ్ తిన్న‌నూరి నిర్మిస్తున్న‌ `మ్యాజిక్‌`, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న `ది ప్యార‌డైజ్‌`, లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `డీసీ`, ర‌జ‌నీకాంత్ `జైల‌ర్ 2`, శింబు, వెట్రిమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్ డ్రామా `అర‌స‌న్‌`, షారుక్ కాన్ `కింగ్‌`, ర‌జ‌నీకాంత్ - సిబి చ‌క్ర‌వ‌ర్తిల‌ 173 మూవీ, బ‌న్నీ- లోకేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌, క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ లైన్‌లో ఉన్నాయి.

ఇదే త‌ర‌హాలో సాయి అభ్యంక‌ర్ 7 క్రేజీ సినిమాల‌తో పోటీప‌డుతున్నాడు. ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌తో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ యంగ్ సెన్సేష‌న్ మ‌ల‌యాళ మూవీ `బాల్టీ`తో సంగీత ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం ప్రారంభించాడు. రెండ‌వ ప్ర‌య‌త్నంగా చేసిన `డ్యూడ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం, పాట‌ల‌కు మంచి పేరు రావ‌డంతో సూర్య `క‌రుప్పు`కు మ్యూజిక్ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. లారెన్స్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్మిస్తున్న `బెంజ్‌`, కార్తి హీరోగా డైరెక్ట‌ర్ త‌మిళ రూపొందిస్తున్న పీరియాడిక్ మూవీ `మార్ష‌ల్‌`, అల్లు అర్జున్ - అట్లీల కాంబినేష‌న్‌లో రానున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి కూడా సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ చేస్తున్నాడు.

ఇవే కాకుండా ధ‌నుష్ 55వ ప్రాజెక్ట్‌. దీనికి రాజ్ కుమార్‌పెరియ‌సామి డైరెక్ట‌ర్‌. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఇక ధృవ్ విక్ర‌మ్ - మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌లో దీప‌క్ రెడ్డి డైరెక్ట‌ర్ చేస్తున్న సినిమా కూడా సాయి అభ్యంక‌ర్ చేతిలో ఉంది. ఇందులో రుక్మిణీ వ‌సంత్ హీరోయిన్‌. వీటితో పాటు శింబు హీరోగా రూపొందుతున్న 49వ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు. దీనికి రాజ్ కుమార్ బాల‌కృష్ణ‌న్ ద‌ర్శ‌కుడు. `గాడ్ ఆఫ్ ల‌వ్‌` అనే టైటిల్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. క‌చ్చి సేరా, ఆస కూడా సాంగ్స్‌తో ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లు పెట్టి టాప్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్‌తో పోటీప‌డుతుండ‌టం విశేషం.