Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఏకైక మ్యూజిక్ డైరెక్ట‌ర్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు భారీ పారితోషికం తీసుకోవడం, సినిమాల లాభాల్లో వాటాలు అందుకోవడం మనం రెగ్యుల‌ర్ గా చూస్తూనే ఉంటాం.

By:  Sivaji Kontham   |   16 Jun 2026 12:07 AM IST
భార‌త‌దేశంలో 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఏకైక మ్యూజిక్ డైరెక్ట‌ర్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు భారీ పారితోషికం తీసుకోవడం, సినిమాల లాభాల్లో వాటాలు అందుకోవడం మనం రెగ్యుల‌ర్ గా చూస్తూనే ఉంటాం. అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టార్ హీరోల రేంజ్‌లో వంద కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోవడం సాధ్యమేనా అంటే.. ఇప్పుడు అది సాధ్య‌మేన‌ని నిరూపిస్తున్నాడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్. ఒక హీరో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే నటించగలడు... కానీ డిమాండ్ ఉన్న ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాత్రం ఒకే ఏడాదిలో నాలుగైదు భారీ చిత్రాలకు సులువుగా మ్యూజిక్ అందించగలడు. ఈ అడ్వాంటేజ్‌తోనే అనిరుధ్ ఇప్పుడు సంపాదనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏల్తున్న అనిరుధ్ హవా అన్ని పరిశ్రమల్లోనూ గట్టిగా నడుస్తోంది. కేవలం తమిళంలోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతని క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే.. రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఒక స్టార్ హీరో రేంజ్‌లో డిమాండ్ చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిరుధ్ ఒక్కో సినిమాకు ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. ఈ రేంజ్ రెమ్యునరేషన్ అనేది ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సంగీత దర్శకుడికీ సాధ్యం కాలేదు.

ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో అనిరుధ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రతిష్టాత్మక భారీ చిత్రాలకు అతడు సైన్ చేసినట్లు సమాచారం. ఈ మూడు చిత్రాలకు గానూ ఒక్కో సినిమాకు 25 కోట్ల చొప్పున కేవలం టాలీవుడ్ నుంచే దాదాపు 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను అతడు అందుకోబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK112, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న రాకా (AA23), అలాగే `గాడ్ ఆఫ్ వార్` చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

కేవలం ఈ మూడు సినిమాల ద్వారానే 75 కోట్లు అందుకుంటున్న అనిరుధ్.. ప్రస్తుత సీజన్‌లో మరో రెండు మూడు తమిళం లేదా హిందీ సినిమాలకు కమిట్ అయితే ఒకే ఏడాదిలో అతని ఆదాయం కేవలం సినిమాల ద్వారానే 100 కోట్ల‌ను మించ‌డం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలోనే అరడజను సినిమాలకు సులువుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు అందించగల సత్తా అనిరుధ్‌కు ఉంది. స‌కాలంలో ప‌ని పూర్తి చేయ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. అందుకే నిర్మాతలకు అంత భారీ మొత్తం చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. ఎందుకంటే అనిరుధ్ పేరు పోస్టర్‌పై ఉంటే సినిమాకు వచ్చే హైప్ కూడా ఓ రేంజులో నిర్మాత‌కు క‌లిసొస్తుంది.

ఒకప్పుడు కేవలం హీరోలు, దర్శకులకు మాత్రమే పరిమితమైన వంద కోట్ల పారితోషికం హంగామాను ఇప్పుడు ఒక సంగీత దర్శకుడు తన టాలెంట్‌తో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం గ్రేట్ అని అంగీక‌రించాలి. అనిరుధ్ ఇచ్చే క్యాచీ ట్యూన్స్, థియేటర్లను షేక్ చేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే దేశంలోనే `హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్`గా అనిరుధ్ రవిచందర్ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. ఏడాదికి 100 కోట్లు పైగా సంపాదిస్తున్న ఏకైక సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టిస్తున్న ఈ యువ‌సంచ‌ల‌నంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వాడి వేడి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.