Begin typing your search above and press return to search.

అనిరుధ్ ప్లాన్ ఫాలో అవ్వాల్సిందేనా? లేకుంటే కష్టమేనా?

అయితే అదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ఇతర తెలుగు సంగీత దర్శకులు ఆ విధమైన ప్లానింగ్‌ ను ఫాలో అవ్వడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

By:  M Prashanth   |   25 April 2026 3:00 PM IST
అనిరుధ్ ప్లాన్ ఫాలో అవ్వాల్సిందేనా? లేకుంటే కష్టమేనా?
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంగీత దర్శకుల్లో ఫుల్ క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అనిరుధ్ రవిచందర్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన యువ సంగీత దర్శకుడిగా ఆయన నిలిచారు. ముఖ్యంగా.. తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన అనిరుధ్, తెలుగు సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అయితే ఇప్పటికే టాలీవుడ్ లో బిజీగా మారిన అనిరుధ్, ఒక ప్రత్యేకమైన ప్లానింగ్‌ తో సంగీతం అందిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆయన కంపోజ్ చేసే పాటలు విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, చాలా కాలం పాటు గుర్తుండిపోతాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, రీల్స్, షార్ట్ వీడియోలలో ఆయన పాటలు ట్రెండ్ అవుతుండటం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

అయితే అదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ఇతర తెలుగు సంగీత దర్శకులు ఆ విధమైన ప్లానింగ్‌ ను ఫాలో అవ్వడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలెంట్ లో ఎలాంటి కొరత లేకపోయినా, ప్రత్యేకతలో మాత్రం కొంతవరకు లోపం కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా పాటలు విడుదలైనప్పుడు ట్రెండింగ్‌ లోకి వస్తున్నా, కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనపడటం లేదని చెబుతున్నారు.

గతంలో తెలుగు సినిమా సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఎన్నో ఆల్బమ్స్ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ గా నిలిచాయి. సినిమాలు మర్చిపోయినా పాటలు మాత్రం తరతరాలకు గుర్తుండిపోయాయి. కానీ ఇటీవలి కాలంలో అలాంటి పరిస్థితి మారిందని పలువురు మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాటలు ఎక్కువగా ట్రెండ్‌ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయని, అందుకే వాటి ఫేమ్ తగ్గుతుందని అంటున్నారు.

ఇక అనిరుధ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆయన పాటలు ట్రెండ్‌ లో ఉండడమే కాకుండా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండటం సక్సెస్ కు కారణమని చెబుతున్నారు. మెలోడీ, మాస్, బీట్.. ఏదేనా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సంగీతాన్ని కంపోజ్ చేయడం ఆయన స్టైల్‌ గా మారింది. ఈ నేపథ్యంలో ఇతర సంగీత దర్శకులు కూడా తమ ప్లానింగ్‌ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న వస్తోంది.

కేవలం ట్రెండ్‌ ను మాత్రమే కాకుండా.. ఎవర్ గ్రీన్ నిలిచే కంపోజిషన్ పై దృష్టి పెట్టాలని అంతా సూచిస్తున్నారు. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రయోగాలు అవసరం అయినప్పటికీ.. మ్యూజిక్ ఎప్పటికీ గుర్తుండమూ అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఏదేమైనా అనిరుధ్ రవిచందర్ సక్సెస్ కు ఆయన పాటల ప్లానింగ్, ప్రెజెంటేషన్ ప్రధాన కారణాలుగా చెప్పాలి. అదే ఫార్ములాను అందరూ ఫాలో కావాలా లేదా అనేది పక్కన పెడితే కొత్త ఆలోచనలు తప్పనిసరి అని మాత్రం ఇప్పుడు క్లియర్ గా తెలుస్తోంది.