రాక్ స్టార్ అనిరుద్.. మ్యాజిక్ మిస్..!
కేవలం ఒకటి రెండు ట్యూన్స్ మాత్రమే సినిమా అంతా వాటినే లాగిస్తూ వచ్చాడని అనిపించింది. అఫ్కోర్స్ కింగ్ డం సినిమాలో వేరియస్ ఫ్యాక్టర్స్ వర్క్ అవుట్ కాలేదు.
By: Ramesh Boddu | 15 Aug 2025 10:48 AM ISTకోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అంటే చాలు సినిమాకు సూపర్ హై వచ్చేస్తుంది. తెర మీద యాక్టర్స్.. కథ, కథనంతో దర్శకుడు వారి వారి బాధ్యతలను నిర్వర్తించాక మిగతా పని నేను చూసుకుంటా అంటూ తన సాంగ్స్, బిజిఎంతో సినిమాను అంత ఎత్తుకి లేపుతాడు అనిరుద్. ముఖ్యంగా రజనీ సినిమాలకు అనిరుద్ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. రజనీ సినిమా అంటే అనిరుద్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తుంటాడు. ఈ కాంబోలో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి.
కూలీ డిజప్పాయింట్..
ఐతే అదే అంచనాలతో వచ్చిన కూలీ మాత్రం డిజప్పాయింట్ చేసింది. మ్యూజిక్ విషయంలో ఎందుకో అనిరుద్ మ్యాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. రాక్ స్టార్ అనిరుద్ కంపోజిషన్ లో లోపమా లేదా అతన్ని అలా పనిచేయించుకున్న లోకేష్ ది మిస్టేకా అన్నది తెలియదు కానీ అనిరుద్ కూలీ పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పేస్తున్నారు. కూలీ విషయంలోనే కాదు ఈమధ్యనే విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు.
కేవలం ఒకటి రెండు ట్యూన్స్ మాత్రమే సినిమా అంతా వాటినే లాగిస్తూ వచ్చాడని అనిపించింది. అఫ్కోర్స్ కింగ్ డం సినిమాలో వేరియస్ ఫ్యాక్టర్స్ వర్క్ అవుట్ కాలేదు. అది వేరే విషయం కానీ కూలీ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ చాలా బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ అనిరుద్ ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ హై మూమెంట్స్ ఇచ్చినా కూడా కంప్లీట్ గా అనిరుద్ సాటిస్ఫై చేయలేదు అన్నది వాస్తవం.
అనిరుద్ రీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం..
ఇలానే కొనసాగితే మాత్రం అనిరుద్ ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అనిరుద్ తనని తాను మళ్లీ రీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రొటీన్ గా మ్యూజిక్ ఇస్తే సరిపోదు. సినిమాకు తగినట్టుగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి అనిరుద్ మళ్లీ సూపర్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడన్నది చూడాలి.
కూలీ సినిమాకు అనిరుద్ ఎక్కువ కష్టపడ్డాడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ అనిరుద్ వర్క్ చేస్తే వచ్చే అవుట్ పుట్ వేరేలా ఉంటుంది. కూలీ విషయంలో అనిరుద్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైందో ఏంటో కానీ థీం మ్యూజిక్ రజనీ సాంగ్ తప్ప మిగతా అంతా అలా అలా లాగించేశాడు. అదే రజనీ జైలర్ సినిమాకు మాత్రం అనిరుద్ మ్యూజిక్ అదిరిపోయింది. లోకేష్ కనకరాజ్ విక్రం సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ వేరే లెవెల్ అనిపించింది. కానీ కూలీకి అటు డైరెక్టర్, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కూడా బెస్ట్ ఇవ్వలేకపోయారు.
