Begin typing your search above and press return to search.

లోకేష్ పై నెగిటివిటీ.. బాధ్యతను భుజాలపై వేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. అసలు ఏమైందంటే?

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లోకేష్ కనగరాజ్ నటుడిగా మారుతున్న 'DC' సినిమా గురించే ముచ్చట్లు నడుస్తున్నాయి.

By:  Madhu Reddy   |   16 May 2026 11:36 PM IST
లోకేష్ పై నెగిటివిటీ.. బాధ్యతను భుజాలపై వేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. అసలు ఏమైందంటే?
X

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లోకేష్ కనగరాజ్ నటుడిగా మారుతున్న 'DC' సినిమా గురించే ముచ్చట్లు నడుస్తున్నాయి. డైరెక్టర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్, ఇప్పుడు హీరోగా స్క్రీన్ ముందుకు వస్తుండటంతో అటు ఇండస్ట్రీలో, ఇటు ఆడియన్స్‌లో బోలెడన్ని అనుమానాలు, మిశ్రమ అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. దానికి కారణం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. లోకేష్ డైరెక్టర్ అయినా, హీరో అయినా అనిరుధ్ మ్యూజిక్ ఎందుకు అంత స్పెషల్ అనేదే ఇప్పుడు చూద్దాం..

లోకేష్ కు 'సేఫ్టీ షీల్డ్' గా అనిరుధ్:

లోకేష్ కనగరాజ్ గత చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. దాంతో ఆయన డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ వైపు రావడంపై సోషల్ మీడియాలో రకరకాల నెగటివ్ కామెంట్లు వచ్చాయి. సరిగ్గా ఇలాంటి టైంలో 'DC' సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఒక రక్షణ కవచంలా పనిచేసింది. ఇక ట్రైలర్‌లో అనిరుధ్ కొట్టిన BGM దెబ్బకు ఆ నెగటివిటీ మొత్తం పోయి, సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఒక రకంగా లోకేష్ యాక్టింగ్ రిస్క్‌ను అనిరుధ్ తన మ్యూజిక్‌తో కవర్ చేసేశాడని చెప్పొచ్చు.

‘రాగా ఆఫ్ రివెంజ్’తో కొత్త స్ట్రాటజీ:

సాధారణంగా ఏ సినిమాకైనా థీమ్ మ్యూజిక్ లేదా BGM ట్రాక్స్‌ను సినిమా థియేటర్లలోకి వచ్చాక రిలీజ్ చేస్తుంటారు. కానీ అనిరుధ్ ఈ సినిమా కోసం ఒక కొత్త బిజినెస్ ప్లాన్ వేశారు. సినిమాకు ప్రాణమైన ‘రాగా ఆఫ్ రివెంజ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రాక్‌ను ముందే స్ట్రీమింగ్ చేస్తానని ట్వీట్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. దీనివల్ల ఆడియన్స్ థియేటర్లలోకి వెళ్లకముందే ఆ మ్యూజిక్ మూడ్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. పాటల కంటే కేవలం 'BGM ట్రాక్స్' తోనే సోషల్ మీడియాలో ఎంత బిజినెస్ చేయవచ్చో అనిరుధ్ చూపిస్తున్నారు.

విడదీయరాని ‘LCU’ సెంటిమెంట్:

ఖైదీ, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ క్రియేట్ చేసిన 'LCU' కి అనిరుధ్ మ్యూజిక్ ఎంత పెద్ద పిల్లరో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌కు ఒక క్రేజీ సెంటిమెంట్ ఉంది. ఇక ఇప్పుడు లోకేష్ మెగాఫోన్ వదిలేసి, కెమెరా ముందుకు వచ్చి నటుడిగా మారుతున్నా కూడా అనిరుధ్ తన వంతు సపోర్ట్‌ను గట్టిగా ఇస్తున్నారు. ఇక లోకేష్ బ్రాండ్‌ను కేవలం దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టే బాధ్యతను అనిరుధ్ తన భుజాలపై వేసుకున్నట్టు కనిపిస్తోంది.

ఇక అనిరుధ్ రవిచందర్ కేవలం పెద్ద హీరోల సినిమాలను మాత్రమే కాదు, ఇలాంటి మిడ్-రేంజ్ ఎక్స్‌ప్రిమెంట్స్ సినిమాలను కూడా తన మ్యూజిక్ మాయతో కాపాడగలరని మరోసారి ప్రూవ్ చేశారు. లోకేష్ కనగరాజ్ నటనపై ఉన్న అంచనాలకు అనిరుధ్ ఇచ్చిన ఈ మ్యూజికల్ బూస్టప్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.