Begin typing your search above and press return to search.

అనిరుధ్ పై నిర్మాతలు ఒత్తిడి.. కాస్త పట్టించుకోవయ్యా!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   4 Nov 2025 5:44 PM IST
అనిరుధ్ పై నిర్మాతలు ఒత్తిడి.. కాస్త పట్టించుకోవయ్యా!
X

ప్రముఖ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గాయకుడిగా కెరియర్ మొదలు పెట్టిన ఈయన.. ధనుష్ హీరోగా నటించిన 3 సినిమాలో ఈయన స్వరపరిచిన "వై దిస్ కొలవరి ఢీ" అనే సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. తమిళ్, తెలుగు, హిందీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయనపై ఇప్పుడు నిర్మాతలు ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆసక్తి కనబరిచే నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒకటి. ఈ సంస్థ అధినేత నాగవంశీ ఇప్పటికే కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ.. మంచి కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి కొంతమంది కొత్త నటీనటులతో కలిసి 'మ్యాజిక్' అనే చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ముగిసింది. కానీ అనిరుధ్ సంగీతం ఆలస్యం వల్ల ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతోంది.

దీనికి కారణం అనిరుధ్ ఇప్పుడు పెద్ద సినిమాలతో బిజీగా ఉండడమే.. అందుకే మ్యాజిక్ చిత్రం కోసం తన పనిని ఆలస్యం చేస్తూ ఈ సినిమాను వాయిదా వేస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని ఇప్పుడు కేవలం మ్యూజిక్ కోసమే ఎదురు చూస్తున్న నేపథ్యంలో త్వరగా ఈ సినిమాకు మ్యూజిక్ పూర్తి చేయాలి అనిరుధ్ పై నిర్మాతలు ఒత్తిడి పెంచుతున్నారట.

అనిరుధ్ కనుక అనుకున్న సమయానికి మ్యూజిక్ అందిస్తే 2026 మొదటి త్రైమాసికంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి అనిరుద్ ఈ చిన్న సినిమాను పట్టించుకోవాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈ కొత్త సంగీత నాటకంలో సారా అర్జున్, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు, అన్మోల్ కజానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మొదట 2024 లోనే విడుదల చేయాలనుకున్నారు. మ్యూజిక్ ఆలస్యం కారణంగానే ఈ మ్యాజిక్ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మరి ఈసారైనా అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించి..త్వరగా విడుదల అవ్వడానికి సహాయపడతారో లేదో తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు నాగావంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

అనిరుధ్ విషయానికి వస్తే.. మాస్టర్, డాక్టర్, డాన్, బీస్ట్, విక్రమ్, తిరు, కూలీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలకు సంగీతం మందిస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్, జైలర్ 2, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అరసన్ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాల విషయంలో బిజీగా ఉండడం వల్లే ఆ మ్యాజిక్ మూవీకి ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం.