కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి మొదటి ఫోటో
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి రజనీకాంత్, ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. అనిరుధ్ స్వయంగా షేర్ చేసిన పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ నెల 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
By: Sivaji Kontham | 11 Nov 2026 7:30 PM ISTసంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్- సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈరోజు (11నవంబర్ 2026) గ్రీస్‌లో వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు.
మొదటి పెళ్లి ఫోటోగ్రాఫ్‌ని అనిరుధ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఐవరీ (ఏనుగు దంతం) రంగు సాంప్రదాయ దుస్తులు.. ముత్యాల ఆభరణాలలో మెరిసిపోతున్న వీరి పెళ్లి ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు అనిరుధ్ సన్ నెట్ వర్క్ అధినేతకు అల్లుడు. రజనీకాంత్ కి స్వయానా మేనల్లుడు గనుక రెండు పెద్ద కుటుంబాల నడుమ సంబంధం ఎంతో దివ్యంగా కలిసింది.
''మై వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్, ఫర్ ఏ లైఫ్ టైమ్.. 11.11'' అంటూ తాజాగా షేర్ చేసిన పెళ్లి ఫోటోకి అనిరుధ్ ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంది. అనిరుధ్-కావ్య మారన్ మధ్య ప్రేమాయణం పై రెండేళ్లుగా చాలా పుకార్లు షికార్ చేసాయి. ఈ జంట షికార్లకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ దీనిని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. చివరికి అందమైన జంట పెళ్లి శుభలేఖలు అచ్చు వేయించే ముందు అధికారికంగా కన్ఫామ్ అయింది. సరిగ్గా ఈ పెళ్లికి ఒక రోజు ముందు నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ఇక ఈ రోజు పెళ్లి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు.
గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ముగియగా, ఈనెల 21న చెన్నైలో అత్యంత ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు భారతీయ సినీ పరిశ్రమ.. రాజకీయ- వ్యాపార రంగాలు.. క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు అగ్ర నటులు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
