Begin typing your search above and press return to search.

వై దిస్‌ 'మదరాసి' అనిరుధ్‌...!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ దక్కించుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

By:  Ramesh Palla   |   7 Sept 2025 12:10 PM IST
వై దిస్‌ మదరాసి అనిరుధ్‌...!
X

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ దక్కించుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ విషయంలో ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా సంతృప్తిగా లేరు. ఇలా చేస్తున్నావేంటి అని అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అనిరుధ్‌ మ్యూజిక్ అంటే మినిమం ఉంటుంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఇటీవల వచ్చిన కూలీ సినిమా మ్యూజిక్‌తో పర్వాలేదు అనిపించిన అనిరుధ్ ఆ తర్వాత, అంతకు ముందు సినిమాలతో నిరాశ పరిచాడు. ఇటీవల వచ్చిన మదరాసి సినిమాకు ఆయన ఇచ్చిన సంగీతం ఏమాత్రం ఆకర్షణగా నిలువలేక పోయింది అంటూ రివ్యూలు వచ్చాయి, అంతే కాకుండా అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.

మదరాసి సినిమా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'మదరాసి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కథ, కథనం విషయంలో పాజిటివ్ టాక్‌ దక్కింది. కానీ మ్యూజిక్‌ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో హిట్‌ను అందుకోలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బాక్సాఫీస్‌ వద్ద రన్‌ ఒక మోస్తరుగా ఉంది. లాంగ్ రన్‌లో సినిమా ఏ మేరకు రాబడుతుంది అనేది చూడాలి. అనిరుధ్ రవిచంద్రన్‌ ఇటీవల తన మార్క్‌ ను మ్యూజిక్‌తో క్రియేట్‌ చేయడంలో విఫలం అవుతున్నాడు అంటూ పదే పదే విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు అనిరుధ్‌ లో ఉన్న ఫైర్ ఇప్పుడు కనిపించడం లేదు అని, ఆయన కేవలం సూపర్‌ స్టార్‌ సినిమాలకు మాత్రమే కాస్త జీల్‌ తో వర్క్ చేస్తున్నాడు అనిపిస్తుంది అంటూ చాలా మంది అభిమానులు సైతం అంతర్గతంగా మాట్లాడుతున్న సమయంలో కామెంట్స్ చేస్తున్నారు.

అనిరుధ్ రవిచంద్రన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌

అనిరుధ్ రవిచంద్రన్ సినిమా అనగానే చాలా మంది బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మదరాసి సినిమా విషయంలోనూ అదే జరిగింది. కానీ అనిరుధ్ స్థాయిలో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే తరహాలో ఆయన మ్యూజిక్ ఉంటే, మెల్లమెల్లగా ప్రాభవం కోల్పోవాల్సి వస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. వై దిస్ మదరాసి మ్యూజిక్‌ అనిరుధ్‌ అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా తాజా ఆల్బం విషయమై విమర్శలు గుప్పిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ చేస్తున్న సినిమాలు ముందు ముందు అయినా విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా ఇప్పటికే కనుమరుగు అయిన సంగీత దర్శకుల జాబితాలో అనిరుధ్‌ చేరి పోయే ప్రమాదం ఉందని పలువురు సినీ ప్రముఖులు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వై దిస్‌ కొలవెరిడీ సాంగ్‌ వైరల్‌

2012లో '3' సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్‌ ట్యూన్ చేసిన వై దిస్ కొలవెరిడి పాట బాగా వైరల్‌ అయింది. సోషల్ మీడియా అంతగా లేని సమయంలోనే ఆ పాట సంచలనం సృష్టించింది. ఆ పాట తర్వాత ఒక్కసారిగా అనిరుధ్‌ టాప్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ ఆయన చేతిలో అర డజను సినిమాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక టైం అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అనిరుధ్‌ టైం నడిచింది. అది ఇంకా ఎంత కాలం నడిచేది ఆయన ఇచ్చే మ్యూజిన్‌ను బట్టి ఉంటుంది. అనిరుధ్‌ వయసు చాలా తక్కువే కనుక మరో పదేళ్ల పాటు ఆయన ఇండస్ట్రీలో ఉండాలని, ఆయన మ్యూజిక్ ఆల్బం సూపర్‌ హిట్‌లు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అయ్యేను చూడాలి.