Begin typing your search above and press return to search.

కూలీకి అనిరుధ్ ఇమోజీ రేటింగ్.. ఏమిచ్చాడో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   12 Aug 2025 2:54 PM IST
కూలీకి అనిరుధ్ ఇమోజీ రేటింగ్.. ఏమిచ్చాడో తెలుసా?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ గ్యాంగ్ స్టర్ డ్రామాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, సాబిన్ సాహిర్, ఉపేంద్ర సహా అనేక మంది స్టార్ట్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకోగా.. అనిరుధ్ తన వర్క్ తో అందరినీ ఫిదా చేశారు. ముఖ్యంగా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో లైవ్ షోతో ఆకట్టుకున్నారు.

అయితే గతంలో తాను వర్క్ చేసిన సినిమాలు రిలీజ్ అయిన టైమ్ లో అనిరుధ్.. సోషల్ మీడియాలో రివ్యూస్ ఇచ్చేవారు. ఫైర్, కప్ ఇమోజీస్ తో రివ్యూ పోస్ట్ చేసేవారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఆపేశారు. అలా ఇప్పుడు కూలీ విషయంలో కూడా పోస్ట్ చేయలేదు. రిలీజ్ కు మరో రెండు రోజులు ఉన్నా.. ఇమేజీ రివ్యూ ఇవ్వలేదు.

దీంతో ఇంకేముంది.. అనిరుధ్ కు సినిమాపై నమ్మకం లేదేమో.. అందుకే రివ్యూ ఇవ్వలేదని అనేక మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ విషయంపై అనిరుధ్ రెస్పాండ్ అయ్యారు. ఊహాగానాలకు చెక్ పెట్టారు. ముంబైలో రీసెంట్ గా కూలీ హిందీ వెర్షన్ ఆడియో ఆల్బమ్ కు సంబంధించి స్పాటిఫై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

తాను ఎమోజీ సమీక్షలను పంచుకోవడం ఇటీవల మానేశానని వెల్లడించారు. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా రాణించవని తనకు తెలుసని, కాబట్టి వాటిని తన సమీక్షలతో హైప్ చేయడం తప్పు అని భావిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు రజినీ ఫ్యాన్స్ అంతా తన రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు కూడా రివ్యూ ఇవ్వకపోతే కొందరు ఫ్యాన్స్ సినిమా బాగోదని నిర్ధరణకు వస్తారని, తాను కూలీని పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చెబుతున్నా వినండి.. అంటూ చెప్పుకొచ్చారు. అభిమానులు కూలీ కోసం కావలసినన్ని ఫైర్, కప్ ఇమోజీస్ ఇచ్చుకోవచ్చని చెప్పారు. కూలీ మూవీకి 10 కప్స్, 10 ఫైర్ ఇమోజీస్ అంటూ రివ్యూ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.