15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన కెరీర్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 2026లో ‘LIK’, ‘జననాయగన్’, ‘DC’, ‘ది ప్యారడైజ్’, ‘జైలర్ 2’ సినిమాలతో ప్రేక్షకులను అలరించినట్లు తెలిపాడు. తన బెస్ట్ మ్యూజిక్ ఇంకా ముందుందని పేర్కొన్నాడు.
By: Madhu Reddy | 17 Nov 2026 12:25 AM ISTసౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మ్యూజిక్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచందర్. చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న అనిరుధ్.. తాజాగా తన కెరీర్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ స్పెషల్ రోజున ఫ్యాన్స్ కోసం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన జర్నీ, కొత్త సినిమాల కబుర్లతో పాటు అనిరుధ్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
ఒక్క పాటతో మొదలై.. ఇక్కడిదాకా:
15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున తన మొదటి పాట రిలీజ్ అయిందని అనిరుధ్ గుర్తు చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నో మంచి అనుభవాలు దొరికాయన్నాడు. ఇక తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషల్లో పాటలు చేసే ఛాన్స్ రావడం, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం తన కెరీర్లో మర్చిపోలేని జ్ఞాపకాలని అనిరుధ్ చెప్పాడు.
స్టార్ హీరోలు, కాన్సర్ట్లతో ఫుల్ జోష్:
దేశంలోని పెద్ద పెద్ద డైరెక్టర్లు, స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లతో పనిచేయడం తన అదృష్టమని అనిరుధ్ అన్నాడు. స్ట్రీమింగ్ రికార్డులు, కోట్ల మంది వినే పాటల కంటే కూడా.. లైవ్ కాన్సర్ట్లలో వేలాది మంది ఫ్యాన్స్ తన పాటలను గొంతెత్తి పాడుతుంటే వచ్చే కిక్ వేరే లెవల్ అని చెప్పాడు. ఇక ఆ మూమెంట్స్ తనకు ఎప్పటికీ స్పెషల్ అని ఎమోషనల్ అయ్యాడు.
2026లో ఐదు పెద్ద సినిమాలతో సందడి:
ఈ 2026వ సంవత్సరం తనకు ఇంకా స్పెషల్ అని అనిరుధ్ తెలిపాడు. ఈ ఏడాది తాను మ్యూజిక్ ఇచ్చిన ‘LIK’, ‘జననాయగన్’, ‘DC’, ‘పారడైజ్’, ‘జైలర్ 2’ సినిమాలు రిలీజ్ అయ్యాయని, అందులోని పాటలన్నీ ఆడియన్స్‌కి బాగా నచ్చాయని సంతోషపడ్డాడు. ఇక 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న టైమ్‌లో ఇంతకంటే మంచి సెలబ్రేషన్ ఏముంటుందని ఆనందం వ్యక్తం చేశాడు.
అసలు ఆట ఇప్పుడే మొదలైంది:
కెరీర్లో ఎన్ని కష్టాలు, ఛాలెంజ్‌లు వచ్చినా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా పనిచేశామని అనిరుధ్ చెప్పాడు. మొదటి రోజు మ్యూజిక్ మీద ఉన్న అదే ప్రేమ ఇప్పటికీ తనను నడిపిస్తోందన్నాడు. 15 ఏళ్లు పూర్తయినా ఇంకా సాధించాల్సిన కలలు చాలా ఉన్నాయని, తన బెస్ట్ మ్యూజిక్ ఇంకా రాబోతోందని చెబుతూ మళ్లీ స్టూడియోలోకి అడుగుపెట్టాడు.
మ్యూజిక్ లవర్స్‌కు పండగే:
తన పాటలను మళ్లీ మళ్లీ వింటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ అనిరుధ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటికే తన బీట్స్‌తో థియేటర్లను షేక్ చేస్తున్న ఈ రాక్‌స్టార్, తన బెస్ట్ మ్యూజిక్ ఇంకా ముందుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో అనిరుధ్ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.
