Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి కాదు కేస‌రి.. ఇదిగో మ‌రో ప్రూఫ్‌

By:  Sivaji Kontham   |   9 Nov 2025 11:27 AM IST
ద‌ళ‌ప‌తి కాదు కేస‌రి.. ఇదిగో మ‌రో ప్రూఫ్‌
X

ఇటీవ‌లి కాలంలో అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతంలోని మోనోట‌నీ కొంత విసుగు పుట్టిస్తోంద‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఫ్లాప్ మూవీ అయినా అజ్ఞాత‌వాసి పాట‌లు ఇప్ప‌టికీ క్లాసిక్ గా నిలుస్తాయి. కొల‌వెరి డి మ్యాజిక్ మ‌ళ్లీ క‌నిపించ‌నే లేదు. అయినా అనిరుధ్ సంగీతంతో ఆల్బ‌మ్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన జ‌న నాయ‌కుడు ఆల్బ‌మ్ నుంచి ఒక్కో పాట విడుద‌ల‌వుతున్నాయి. లేటెస్ట్ సింగిల్ కూడా ఇదే బాప‌తు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అనిరుధ్ నుంచి మునుపెన్న‌డూ లేని స‌రికొత్త‌ బాణీ వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ ఇది ఎప్ప‌టిలానే రొటీన్ సాంగ్. ఒక మాస్ హీరోని ఎలివేట్ చేసే రెగ్యుల‌ర్ బీట్ తోనే స‌రిపుచ్చాడు. అయితే ద‌ళ‌ప‌తి విజ‌య్ మానియా కార‌ణంగా ఈ పాట ఇంట‌ర్నెట్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది.

ముఖ్యంగా విజ‌య్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు పూజా హెగ్డే, మ‌మిత భైజు కాంబినేష‌న్ కార‌ణంగా ఈ పాట విజువ‌ల్ గా అద్భుత‌మైన ఫీస్ట్ గా మారింది. దీంతో ఈ పాట‌ను నెటిజ‌నులు ప‌దే ప‌దే త‌ర‌చి చూస్తున్నారు. జ‌న నాయ‌గ‌న్ చిత్రం తెలుగు వెర్ష‌న్ జ‌న నాయ‌కుడుగా విడుద‌ల కానుంది. అయితే తెలుగు వెర్ష‌న్ పాట‌ను ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి తెలుగు ప్రేక్ష‌కులు ఈ త‌మిళ బీట్ నే అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక ఈ సింగిల్ సాంగ్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇరువురు భామ‌ల (పూజా హెగ్డే, మ‌మిత భైజు) న‌డుమ న‌లిగిపోయే యువ‌కుడిగా క‌నిపించ‌డంతో దీనికి స్ఫూర్తి `భ‌గ‌వంత్ కేస‌రి` అంటూ మ‌రోసారి గుస‌గుస మొద‌లైంది. చాలా కాలంగా `జ‌న నాయ‌గ‌న్` చిత్రం అనీల్ రావిపూడి - బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్ అంటూ ప్రచారం ఉంది. ఇటీవ‌ల విజ‌య్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా, దానిలో అత‌డు పోలీస్ అధికారిగా క‌నిపించ‌డం కూడా చాలా పోలిక‌ల‌ను ఆవిష్క‌రించింది. ఆ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూడ‌గానే, బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల గుర్తుకు వ‌స్తున్నార‌ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

అయితే భ‌గ‌వంత్ కేస‌రి లైన్ తీసుకుని విజ‌య్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌ను మ‌లుచుకున్న‌ట్టు తెలిసింది. విజ‌య్ ఇటీవ‌ల రాజ‌కీయాల్లో ఉన్నారు గనుక , మారిన కొత్త ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను అల్లుకున్నారట‌. ఈ సినిమా పాక్షికంగా మాత్ర‌మే `భ‌గ‌వంత్ కేస‌రి` టింజ్ ని ప‌రిచ‌యం చేస్తుంద‌ని భావిస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే భిన్నంగా ఎలా అతీతంగా ఉంటుందో వేచి చూడాలి. హెచ్ . వినోద్ ఈ సినిమాని ఏ రేంజులో తెర‌కెక్కించారు అన్న‌ది తెలియాలంటే సంక్రాంతి 2026 వ‌ర‌కూ ఆగాల్సిందే. సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్ రాజా సాబ్ స‌హా ప‌లు భారీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని స‌మాచారం.