మణి శర్మ, హరీష్ జైరాజ్ లకు మూవీస్ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీలకపాత్ర వహిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే.
By: Gopi Velupala | 2 Oct 2026 8:45 AM ISTఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీలకపాత్ర వహిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. స్క్రీన్ మీద ప్రేక్షకుడికి కనిపించే విజువల్ యొక్క వాల్యూ తెలియాలంటే దానికి మ్యూజిక్ యాడ్ అవ్వాల్సిందే. అది లేకుండా సినిమా చూస్తే మనకు ఎలాంటి ఫీల్ కలగదు. అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ విషయంలో మన దర్శకులు సైతం చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది సంగీత దర్శకులు ఉన్నప్పటికి ఒక్కప్పుడు మణిశర్మ అందించిన మ్యూజిక్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు... 'మెలోడీ బ్రాహ్మ ' గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాలకు బాణీలను సమకూర్చిన ఆయన ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. నిజానికి మన స్టార్ హీరోల కెరియర్ స్టార్టింగ్ లో చేసిన చాలా సినిమాలకు మణిశర్మ నే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. 'ఖలేజా' మూవీ వరకు మహేష్ బాబు చేసిన 95% సినిమాలకు మణిశర్మ నే సంగీతాన్ని అందించాడు. చిరంజీవితో సైతం ఆయన వరుస సినిమాలు చేశాడు. బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలా వరుసగా స్టార్ హీరోలతో కొన్ని సంవత్సరాల పాటు తన జర్నీని కొనసాగించాడు.
కానీ కాలక్రమేనా సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల అభిరుచిని కనుగొన్న చాలామంది దర్శకులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీలోకి రావడం చాలా తక్కువ సమయంలోనే ఆయన క్వాలిటీ మ్యూజిక్ ను అందిస్తుండటం వల్ల ఆయన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. దానివల్ల మణిశర్మ కి రావాల్సిన అవకాశాలన్నీ తమన్ వైపు వెళ్ళిపోయాయి. నిజానికి ఇక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎవరి పని వాళ్లు పెర్ఫెక్ట్ గా చేసుకుంటు వెళ్తే సరిపోతుంది. వాళ్ల మ్యూజిక్ కి జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో దాన్ని బట్టే డైరెక్టర్లు ఆయా మ్యూజిక్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న యువత ను అట్రాక్ట్ చేస్తూ ఫాస్ట్ బీట్స్ తో మ్యూజిక్ ని అందించే వాళ్ళకే ఇండస్ట్రీ లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.ఇండస్ట్రీ అనేది ఒక వార్ జోన్ లాంటిది. ఎవరైతే ఇక్కడ నిరంతరం వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు...
హరీష్ జైరాజ్
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన హరీష్ జయరాజ్ సైతం మహేష్ బాబుతో చేసిన 'స్పైడర్' సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. నిజానికి ఆయన మ్యూజిక్ లో చాలా క్వాలిటీ ఉంటుంది. కథలోని ఎమోషన్ ను డైల్యూట్ కాకుండా చాలా పకడ్బందీగా సంగీతాన్ని అందిస్తాడు. శంకర్, ఏ ఆర్ మురుగదాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన ఆయన కాలక్రమేణ వాళ్లు కూడా అతన్ని పక్కన పెట్టి కొత్తదనాన్ని ఆస్వాదించడానికి ఇతర సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపారు. దాంతో హరీష్ జయరాజ్ పెద్ద అవకాశాలను అందుకోలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. మొత్తానికైతే తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అనిరుధ్ హవా నడుస్తుంది. అనిరుధ్ ఎంట్రీ కూడా హరీష్ జైరాజ్ కి అవకాశాలు రాకపోవడానికి ఒక కారణం గా చెప్పవచ్చు.
ఇండస్ట్రీ లో సక్సెస్ ఉన్న వాళ్ళకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అనిరుధ్ పట్టుకుందల్ల బంగారం అవుతుంది. కొట్టిందల్ల సిక్సర్ అవుతుంది. ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్, ఈడీఎం, హెవీ బీట్స్ అలాగే మోడ్రన్ మ్యూజిక్ ను యూత్ కి బాగా అలవాటు చేశాడు. దానివల్ల వేరే వాళ్ళ మ్యూజిక్ వింటున్నప్పటికీ ప్రేక్షకులకు అవి పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. అది గమనించిన దర్శకులు వల్ల సినిమాలో అనిరుధ్ ను భాగం చేసి భారీ హైప్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో డైరెక్టర్లు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లను పక్కన పెట్టేస్తున్నారు... అవకాశాలు లేకుండా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ ఆల్బమ్ ను క్రియేట్ చేయగలిగితే వాళ్లకు కూడా ఇండస్ట్రీలో మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి...
