బక్కోడి పనికి నాగ్ ఫిదా!
ఇక నాగార్జున ఇప్పుడు సోషల్ మీడియాలో అనిరుద్ రవిచందర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు.
By: M Prashanth | 8 Aug 2025 12:13 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాపై ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ టాక్ పెరుగుతోంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు అందరి చూపు నాగార్జున మీదే ఎక్కువగా నిలిచింది. కుబేర సినిమాలో కాస్త నెగిటివ్ గుడ్ టచ్ తో భిన్నంగా కనిపించిన నాగ్ ఇప్పుడు కూలీ సినిమాలో కంప్లీట్ గా అంతకుమించి అనేలా దర్శనమివ్వబోతున్నాడు.
కూలీ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా నాగ్ కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. కానీ ఆయన ఈసారి ప్రమోషన్లలో ఎంత ఎనర్జీ చూపుతున్నారో చూస్తే సర్ప్రైజ్ అవ్వాల్సిందే. చెన్నై నుండి హైదరాబాద్ వరకు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ, సినిమా గురించి కన్‌ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు నాగ్. ప్రమోషనల్ ఈవెంట్లలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
“కూలీ అనేది ఓ డిఫరెంట్ సినిమా అనుభూతిని అందించబోతుంది. లోకేశ్ కనగరాజ్ తీసిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది” అంటూ ఓ అభిమానం పంచుకున్నారు. తన పాత్రను, దర్శకుడి వర్క్‌ను బాగా హైలైట్ చేసిన నాగ్… దర్శకుడు లోకేశ్, హీరో రజనీకాంత్ మీద ఎంత బిలీవ్ చేసారో తన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఇక నాగార్జున ఇప్పుడు సోషల్ మీడియాలో అనిరుద్ రవిచందర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. కూలీ సినిమా చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ను ట్యాగ్ చేసి, ఫైర్ ఎమోజీతో ట్వీట్ చేశారు. కొన్ని సార్లు మాటల కంటే ఎమోజీలు ఎక్కువ చెబుతాయన్నట్లు, నాగ్ ట్వీట్ బేస్ చేసిన దాన్ని బట్టి స్పష్టంగా అనిపించింది. అనిరుద్ మ్యూజిక్ కూలీ సినిమాకు ఎలాంటి ఎలివేషన్ ఇచ్చిందో.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాకు కొత్త ఎనర్జీ ఇచ్చాడనే హింట్ ఇచ్చినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల కాలంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో సినీ ఇండస్ట్రీ బాగా అర్థం చేసుకుంది. అనిరుద్ చేసిన ఏ సినిమా తీసుకున్నా పాటలే కాదు, బీజీఎం కూడా సినిమాకు స్పెషల్ హైప్ తీసుకువస్తుంది. రజనీకాంత్ లోకేశ్ కాంబోలో వస్తున్న సినిమాలో బక్కోడు(అనిరుద్) మ్యూజిక్ సత్తా చూపిస్తాడని అందరూ ఊహించగా, నాగ్ స్పెషల్‌గా రియాక్ట్ కావడం మరింత ఆసక్తికరంగా మారింది.
కూలీ సినిమాలో నాగార్జున ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచాయి. సాధారణంగా నాగ్‌ను, రొమాంటిక్ గాయ్‌గా చూస్తూ ఉంటారు. కానీ ఈసారి పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్‌లో కొన్ని సీన్స్‌తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుంది, అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ఆవుట్‌పుట్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
