అనిరుధ్- కావ్య మారన్.. మళ్లీ అదే డిస్కషన్..
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో మళ్లీ అనిరుధ్- కావ్య ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.
By: M Prashanth | 13 Nov 2025 2:34 PM ISTకోలీవుడ్ అండ్ సౌత్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
అప్పుడు ఆ విషయంపై అనిరుధ్ రవిచందర్ స్పందించి.. అవన్నీ రూమర్సేనని తెలిపారు. అనిరుధ్, కావ్య మారన్ మంచి స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది ఆయన టీమ్. పెళ్లి వార్తలు అబద్ధమని తెలిపింది. అయితే ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న పిక్ తో మళ్లీ అనిరుధ్- కావ్య ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.
న్యూయార్క్ నగర వీధుల్లో అనిరుధ్, కావ్య మారన్ కలిసి కనిపించారంటూ ఆ ఫోటోతో సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ తీసిన వ్లాగ్ వీడియోలో వారు అలా కనిపించారంటూ పలువురు నెటిజన్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో అనిరుధ్- కావ్య మధ్య సమ్ థింగ్ ఏదో ఉందని ఇప్పుడు పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందులో నిజమెంత అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు. అప్పట్లో అనిరుధ్ టీమ్ రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోపై స్పందిస్తుందేమో వేచి చూడాలి.
కాగా.. ప్రస్తుతం అనిరుధ్ సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ హీరో ధనుష్ త్రీ సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు నంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నారని చెప్పాలి. సౌత్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయననే సమాచారం. ప్రస్తుతం అనేక బడా సినిమాలకు వర్క్ చేస్తూ బిజీగా ఉన్నారు.
అదే సమయంలో సన్ రైజర్స్ టీమ్ కు సహా యజమానురాలిగా, ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు కావ్య మారన్. ఇప్పటికే ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఐపీఎల్ మ్యాచులకు అటెండ్ అయ్యే సమయంలో.. ఆమెకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రముఖ బ్యానర్ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారనే కూతురు కావ్య అన్న సంగతి తెలిసిందే.
