చూడముచ్చటైన జంటకు దిష్ఠి తగులుతుందేమో!
అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్‌ల గ్రీస్ వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆర్థికంగా బలమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలను ‘గోల్డ్ డిగ్గర్స్’ అనరెందుకంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 21న చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌కు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
By: Sivaji Kontham | 20 Nov 2026 2:37 AM ISTప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్- సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్‌ల వివాహం ఇటీవల గ్రీస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన తాజా ఫోటోలు, వీడియోలను అనిరుధ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఈ జంట కెమిస్ట్రీ, డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు చూసి పలువురు అభిమానులు ప్రేమ- ఆశీర్వాదాలతో కూడిన కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఈ ఫోటోల కింద వచ్చిన కొన్ని కామెంట్లు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఈ జంటపై దిష్టి తగలకుండా ఉండాలని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఫన్నీగా- వ్యంగ్యాత్మకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా.. ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయిలను ఎందుకు `గోల్డ్ డిగ్గర్స్` అనరంటూ ఓ యూజర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకుముందు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీని ప్రేమించిన సుస్మితా సేన్ పై వచ్చిన కామెంట్లు ఇప్పుడు వినిపించలేదేమిటి? అనే ప్రశ్న వచ్చింది.
మరోవైపు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో నవంబర్ 11న సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎంకే స్టాలిన్ వంటి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. విదేశాల్లో జరిగిన ఈ వేడుకల అనంతరం.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..
అతిథులలో టాలీవుడ్ ప్రముఖులు:
ఈ వేడుకకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, ధనుష్, శివకార్తికేయన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ .. ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సభ్యులు ఈ విందులో సందడి చేయనున్నారు.
ఇక టాలీవుడ్- తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అనిరుధ్‌కు తెలుగు చిత్ర పరిశ్రమతో ఉన్న సత్సంబంధాలు, కావ్యా మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావడంతో ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో అతిథులు హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ వంటి అగ్ర హీరోలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ తదితరులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు చెన్నైలో జరగనున్న ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
