'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ పద్ధతిలో జరిగినట్లు డీఎంకే నేత టీఆర్బీ రాజా వెల్లడించారు. ఈ విధానంలో పురోహితులు, మతపరమైన క్రతువులు లేకుండా వధూవరులు పూలదండలు, గొలుసులు మార్చుకుని వివాహం చేసుకుంటారు. పెరియార్ ప్రారంభించిన స్వాభిమానం ఉద్యమం నుంచి ఈ సంప్రదాయం పుట్టుకొచ్చింది. 1967లో తమిళనాడులో చట్టబద్ధ గుర్తింపు పొందింది.
By: Madhu Reddy | 13 Nov 2026 3:57 PM ISTకోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ అధినేత కళానిధి మారన్ కూతురు, హైదరాబాద్ సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ గత కొంతకాలంగా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ విషయాన్ని ఈ జంట ఎక్కడ బయట పెట్టకుండా రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అలాంటి ఈ జంట నవంబర్ 10, 11 తేదీలలో అతిరథ మహారథుల సమక్షంలో 'సెల్ఫ్ రెస్పెక్ట్' పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దీనినే స్వాభిమానం పద్ధతి అని కూడా అంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ , మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అందులో భాగంగానే అక్కడ జరిగిన పెళ్లి తంతు వీడియోలు వైరల్ అవ్వగా అందులో పురోహితుడు గానీ, మత పెద్దలు కానీ అక్కడ కనిపించలేదు. పైగా ఇద్దరు పూలదండలు మార్చుకొని ఒకరి మెడలో ఒకరు గొలుసులు వేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక అందులో భాగంగానే వీరిద్దరూ సెల్ఫ్ రెస్పెక్ట్ పద్ధతిలో వివాహం చేసుకున్నారా అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తుండగా.. ఈ విషయంపై డీఎంకే ఐటి విభాగం కార్యదర్శి డాక్టర్ టీ.ఆర్.బీ.రాజా స్పష్టతనిచ్చారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. అనిరుధ్, కావ్య సెల్ఫ్ రెస్పెక్ట్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ..ఈ పద్ధతిలో జరిగే వివాహ వేడుకలకు మత పెద్దలు కానీ పురోహితులు కాని ఉండరు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కావ్యకు, ఒక గొలుసు , అనిరుధ్ కు మరో గొలుసు అందించారు. వీరిద్దరూ ఒకరికొకరు ఆ గొలుసులు మార్చుకున్నారు. ఆ తర్వాత పూలదండలు మార్చుకున్నారు.కుటుంబ సభ్యులు, సన్నిహితుల కలయికతో.. పెద్దల ఆశీస్సుల నడుమ వారి వివాహం జరిగింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ పద్ధతి ఎప్పుడు? ఎలా? ఎక్కడ మొదలైంది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 1 67లో తమిళనాడులో ఈ వివాహ పద్ధతికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. అప్పటి సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి ప్రారంభించిన స్వాభిమానం ఉద్యమం నుండే ఈ వివాహ సాంప్రదాయం పుట్టుకొచ్చింది. సాంప్రదాయ వివాహ ఆచారాలు, కుల వ్యవక్ష , పెళ్లిలలో మత పెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ..ఈ ఉద్యమం ముందుకు సాగింది. ఈ వివాహ పద్ధతిలో వధూవరులు ఒకరికొకరు జీవితం భాగస్వామ్యులుగా అంగీకరిస్తూ పూలదండలు మార్చుకోవచ్చు. ఇందులో పురోహితుడు లేదా విస్తృతమైన మతపరమైన క్రతువులు ఉండరు. ఇద్దరు మనుషుల మధ్య వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉంటే చాలు ఎటువంటి పూజలు, పురస్కారాలు అవసరం లేదు అని ఈ పద్ధతి నిరూపిస్తుందట.
ఇకపోతే 1967లోనే హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా సాంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండానే సెల్ఫ్ రెస్పెక్ట్ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు అని ప్రభుత్వం కల్పించింది. ఇలా అనిరుద్ కావ్య తమ పెళ్ళి వేడుకలో సెల్ఫ్ రెస్పెక్ట్ వివాహ పద్ధతిని అనుసరించినట్లు రాజా వెల్లడించారు ఇక దీంతో ఈ పెళ్లి మరోసారి వార్తల్లో నిలిచింది.
