Begin typing your search above and press return to search.

అని వెడ్స్ కావ్య: పదేళ్ల క్రితమే క్లారిటీ.. మరీ అంత కరెక్ట్ గానా!!

ఎందుకంటే ఆమె సన్ గ్రూప్ ఓనర్ కళానిధి మారన్ కూతురు. సన్ టీవీ నెట్‌వర్క్ సహా మీడియా బిజినెస్ లో మంచి పొజిషన్ లో ఉన్న సంస్థకు వారసురాలు.

By:  M Prashanth   |   17 Oct 2026 2:49 PM IST
అని వెడ్స్ కావ్య: పదేళ్ల క్రితమే క్లారిటీ.. మరీ అంత కరెక్ట్ గానా!!
X

స్టార్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ పేర్లు ఇప్పుడు నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే వారిద్దరూ మ్యారేజ్ చేసుకోనుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. అనిరుధ్ లైఫ్ పార్టనర్ ఎలా ఉంటారో పదేళ్ల క్రితమే ఓ టారో రీడర్ అంచనా వేశారట. ఇప్పుడు కావ్య మారన్ బ్యాక్ డ్రాప్ తో ఆ మాటలను పోల్చి చూస్తున్న నెటిజన్లు.. మరీ ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

పదేళ్ల క్రితం తమిళ ఛానెల్ తంతి టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో అనిరుధ్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ మహిళా టారో కార్డ్ రీడర్ ఆయన ఫ్యూచర్, పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పారు. అనిరుధ్‌ కు లవ్ మ్యారేజ్ జరుగుతుందని, అయితే పేరెంట్స్ అంగీకారంతోనే ఆ పెళ్లి జరుగుతుందని అంచనా వేశారు. అంతేకాదు.. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా ఇండస్ట్రీ చెందిన వ్యక్తి కాదని కూడా చెప్పారు.

అంతే కాదు.. అనిరుధ్ కాబోయే భార్య బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉంటుందని, మీడియా- టెలికమ్యూనికేషన్స్ లేదా బ్రాడ్‌ కాస్టింగ్ రంగానికి సంబంధించిన పెద్ద సంస్థతో రిలేషన్ కలిగి ఉంటుందని ఆ టారో రీడర్ చెప్పినట్లు వీడియోలో ఉంది. ఆమె చెన్నైలోనే నివసిస్తుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కావ్య బ్యాక్ డ్రాప్ చూస్తే ఆ విషయాలు హాట్ టాపిక్ కావడంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

ఎందుకంటే ఆమె సన్ గ్రూప్ ఓనర్ కళానిధి మారన్ కూతురు. సన్ టీవీ నెట్‌వర్క్ సహా మీడియా బిజినెస్ లో మంచి పొజిషన్ లో ఉన్న సంస్థకు వారసురాలు. ఎంబీఏ పూర్తి చేసిన కావ్య ప్రస్తుతం ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు చెన్నైతోనూ రిలేషన్ ఉంది. దీంతో పదేళ్ల క్రితం చెప్పిన విషయాలు కావ్య మారన్‌ కు చాలా దగ్గరగా ఉన్నాయని నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీకి చెందని వ్యక్తి కావడం, హైయ్యర్ స్టడీస్ చదవడం, మీడియా బ్యాక్ గ్రౌండ్ ఉండటం.. ఆ అంశాలన్నీ ఒకే దగ్గరికి రావడంతో త్రో బ్యాక్ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లోనే ఇన్ని వివరాలు ఎలా చెప్పారు.. మరీ ఇంత కరెక్ట్‌ గా ఎలా సరిపోయాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ అలాంటి అంచనాలను ఎప్పుడూ నిజమని అనుకోలేం. టారో కార్డులతో చెప్పే విషయాలు అంచనాలు మాత్రమే.

ఇక అని, కావ్య మ్యారేజ్ నవంబర్‌ లో గ్రీస్‌ లో జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే కళానిధి మారన్ దంపతులు ఇన్వైట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు కూడా. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. దీంతో అనిరుధ్, కావ్య రిసెప్షన్ పై క్లారిటీ ఉన్నా.. పెళ్లి డేట్ పై క్లారిటీ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.