మీ తెలుగోడు ఒకడు వచ్చి నా జీవితాన్ని మార్చాడు
`యానిమల్`కి ముందు 'యానిమల్'కి తర్వాత బాబి డియోల్ లైఫ్ గురించి తెలిసిందే.
By: Sivaji Kontham | 22 Sept 2025 11:00 AM IST`యానిమల్`కి ముందు 'యానిమల్'కి తర్వాత బాబి డియోల్ లైఫ్ గురించి తెలిసిందే. అప్పటికి డియోల్ ఫ్యామిలీ హీరోలకు కొన్నేళ్లుగా బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. సూపర్ స్టార్లుగా పేరున్న అన్నదమ్ముల్లో ఎవరూ సినీపరిశ్రమల్లో రాణించడం లేదు. ఎవరికీ సరైన అవకాశాల్లేవ్. సన్నీడియోల్ లాంటి పెద్ద హీరో కూడా ఖాళీ. బాబి డియోల్ కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇక అతడు తిరిగి వస్తాడా? అనుకుంటున్న సమయంలోనే అతడి లైఫ్ ని మార్చేసింది ఒకే ఒక్క ఆఫర్. ఆ ఒక్క ఆఫర్ అతడి జీవితంలో గేమ్ ఛేంజర్. ఆ సినిమా ఏమిటో.. ఆ దర్శకుడు ఎవరో ఇప్పుడు దర్శకుడు బాబి అలియాస్ రవీంద్ర కొల్లి చెప్పిన సంగతులు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
15 ఏళ్లుగా ఇంట్లోనే కూచున్న నటుడు బాబి డియోల్. ఒకే ఒక్క తెలుగు వాడు నా జీవితాన్ని మార్చాడు బాబీ అని నాతో అన్నారు డియోల్.. అని చెప్పారు. దర్శకుడు బాబి ఓ చాటింగ్ సెషన్ లో మాట్లాడుతూ..''యానిమల్ తర్వాత అతడి(బాబి డియోల్) లైఫ్ మారిపోయింది. టచ్ చేస్తేనే ఏడ్చేస్తున్నాడు. నా లైఫ్ ని నేను ఇలా ఊహించలేదు అన్నాడు నాతో. ఆల్మోస్ట్ 15 ఏళ్లు ఇంట్లోనే కూచున్నాను.. నా భార్య డబ్బులపై పడి బతికేసాను.. ఒకసారి బాత్రూమ్ లో ఉన్నప్పుడు నా కొడుకు అన్న మాట వినలేకపోయాను.. ఇక నాన్న పని చేయడా అమ్మా? అని కొడుకు అడిగాడట. నిజానికి వాడు ఏదీ చూడలేదు. వాళ్ల నాన్న సూపర్‌స్టార్ ఒకప్పుడు. అప్పటికి వాడు కడుపులో కూడా లేడు. వాడికి ఏజ్ వచ్చేప్పటికి వాళ్ల నాన్న ఇంట్లో కూచున్నాడు`` అంటూ బాబి డియోల్ వ్యథ గురించి చెప్పుకొచ్చాడు.
నేను ఎందుకు బయటకు వెళ్లలేకపోతున్నాను. అందరు నిర్మాతల ఆఫీస్ లకు ఫోటోలు పంపేవాడిని.. బాబీ నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు సూపర్.. అంటూనే ఎవరూ అవకాశాలివ్వలేదు. మీ తెలుగోడు ఒకడు వచ్చి నా జీవితాన్ని మార్చాడు బాబీ ! అని చెప్పారు బాబి డియోల్.
బాబి డియోల్ `యానిమల్`లో పాత్ర విషయంలో ఛూజీగా ఉన్నాడు. అప్పటికి అతడికి అడిగినంతా ఇచ్చేందుకు సందీప్ వంగా టీమ్ సిద్ధమైనా.. అతడు కిక్కురాకపోతే ఆ పాత్రను చేయడు.. అది కూడా అతడిలో ఉంది! అని బాబి తెలిపారు. సందీప్ రెడ్డి వంగాను చూస్తేనే బాబి డియోల్ ఎమోషనల్ అయిపోతాడని అన్నారు.
