షో టైం.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..!
ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర షో టైం అంటూ ఒక రియాలిటీ షో మొదలు పెడుతున్నారు.
By: Ramesh Boddu | 13 Aug 2025 10:57 AM ISTటాలెంట్ ఉన్న వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఆ టాలెంట్ కి తగ్గ ఛాన్స్ లు రావు కాబట్టె వాళ్లు అక్కడే ఉండిపోతారు. సినీ పరిశ్రమలో కొత్త వాళ్లకు ఛాన్స్ లు ఎప్పుడూ ఉంటాయి. కానీ అవి చాలా కొందరికి మాత్రమే వస్తాయి. టాలెంట్ తో పాటు కాస్త లక్ కూడా కలిసి వస్తేనే అవకాశాలు వస్తుంటాయి. ఐతే తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. ఐతే సినిమా ఛాన్స్ ల కోసం చూసే వారికి షో టైం ఒక అద్భుతమైన వేదిక కాబోతుంది.
ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షో..
ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర షో టైం అంటూ ఒక రియాలిటీ షో మొదలు పెడుతున్నారు. ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షోగా ఇది వస్తుంది. సినిమాల్లోకి వెళ్లాలనుకునే వారు.. రైటర్, యాక్టర్, డైరెక్టర్, ఏడి, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఇలా అన్ని విభాగాల్లో వారికి ఈ రియాలిటీ షోలో తమ టాలెంట్ చూపించే ఛాన్స్ ఇస్తారు. ఏటీవీ ఒరిజినల్స్ భాగస్వామ్యంతో ఈ షో టైం రియాలిటీ షో రాబోతుంది.
ఈ షో టైం లో పాల్గొనాలనుకునే వారు ఈ మెయిల్ ఐడీకి ప్రిఫైల్స్ పంపించాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి షో టైం ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ల టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఔత్సాహిక కళాకారులు ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో చూపిస్తా అంటున్న వాళ్లు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇండస్ట్రీకి టాలెంటెడ్ పీపుల్..
అనీల్ సుంకర టాలీవుడ్ లో నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ఇండస్ట్రీకి టాలెంటెడ్ పీపుల్ ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ షో టైం స్టార్ట్ చేస్తున్నారు. ఐతే ఈమధ్య దిల్ రాజు కూడా దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్రోగ్రాం మొదలు పెట్టాడు. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ లో అవకాశాలు ఇస్తారని తెలుస్తుంది.
ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లను ఆహ్వానిస్తే కొత్త టాలెంట్ వస్తుంది. సో అద్భుతమైన కథలు.. సినిమాలు.. విజువల్ ట్రీట్ ఉంటుంది. ఇటు అనీల్ సుంకర షో టైం, అటు దిల్ రాజు డ్రీమ్స్ ఇలా ప్రతి ఒక్కరు కొత్త వాళ్లను ముఖ్యంగా ప్రతిభ ఉన్న వారిని వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ షో టైం కాన్సెప్ట్ ఏంటి.. అది ఎలా ఉండబోతుంది. దానిలో వాళ్లకి ఎలాంటి టెస్ట్ ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.
