Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ రావ‌న్నారు

మ‌రికొంద‌రు మాత్రం సినిమా క‌థ ముందే చెప్పేస్తే ఇక థియేట‌ర్ల‌లో కొత్త‌గా ఏముంటుంద‌ని క‌థ‌ను రివీల్ చేయ‌కుండా చాలా టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌ను క‌ట్ చేస్తూ ఉంటారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Aug 2025 12:00 AM IST
ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ రావ‌న్నారు
X

సినిమా క‌థ ఏంట‌నేది ముందే రివీల్ చేస్తే ఆడియ‌న్స్ కు ఓ అవ‌గాహ‌న ఉంటుంది కాబ‌ట్టి మ‌రింత మంది థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఛాన్సుంటుంద‌ని కొంద‌రు టీజ‌ర్, ట్రైల‌ర్ లో క‌థ‌ను రివీల్ చేస్తే మ‌రికొంద‌రు మాత్రం సినిమా క‌థ ముందే చెప్పేస్తే ఇక థియేట‌ర్ల‌లో కొత్త‌గా ఏముంటుంద‌ని క‌థ‌ను రివీల్ చేయ‌కుండా చాలా టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌ను క‌ట్ చేస్తూ ఉంటారు.

అయితే టీజ‌ర్, ట్రైల‌ర్ ద్వారా ఆడియ‌న్స్ కు క‌థ తెలిసినంత మాత్రాన సినిమాకు ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంక‌ర వెల్ల‌డించారు. టాలీవుడ్ లోని స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. ఆయ‌న తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ ను అందుకున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాలు అనుకున్న స్థాయి స‌క్సెస్ అవ‌డం లేదు.

రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన అనిల్ సుంక‌ర కొన్ని సినిమాలు ఊహించిన స‌క్సెస్ అందుకోక‌పోయినా కొన్ని సంవత్స‌రాల త‌ర్వాత కూడా గుర్తిండిపోతాయ‌ని, కొన్నాళ్ల త‌ర్వాత చూసిన‌ప్పుడు ఇలాంటి సినిమాను మ‌నం ఆద‌రించ‌లేకపోయామా అని బాధ క‌లుగుతుంద‌ని, అలాంటి సినిమాల్లో 1 నేనొక్క‌డినే ఒక‌టని అంటున్నారు అనిల్ సుంక‌ర.

ట్రైల‌ర్ లేకుండానే సినిమా రిలీజ్

మ‌హేష్ బాబు హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 1 నేనొక్క‌డినే భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా నుంచి మ‌హేష్ లుక్స్ రిలీజైన‌ప్పుడు చాలా మంది ఈ సినిమాతో మంచి స‌క్సెస్ అందుకోబోతున్నామ‌నుకున్నారు. ఈ సినిమాకు ట్రైల‌ర్ కూడా క‌ట్ చేసి కొన్ని థియేట‌ర్ల‌లో ప్లే చేయ‌డానికి రెడీ చేశామ‌ని, ట్రైల‌ర్ రిలీజ్ చేసే ముందు ఒక‌రు ఫోన్ చేసి ఈ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే క‌థ తెలిసిపోయి సినిమాకు ఓపెనింగ్స్ రావ‌ని చెప్ప‌డంతో ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌కుండానే సినిమాను రిలీజ్ చేశామ‌న్నారు.

దూకుడు రికార్డులు బ్రేక్ చేస్తుంద‌నుకున్నా

అలా ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే సినిమాను రిలీజ్ చేయ‌డం వ‌ల్ల సినిమాను చూస్తున్న‌ప్పుడు హీరోకు ఉన్న మైండ్‌సెట్ వ్యాధి గురించి తెలిసి చాలా మంది డిజ‌ప్పాయింట్ అయ్యార‌ని, ఆడియ‌న్స్ కు ఆ విష‌యం ముందే తెలిసి ఉంటే సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చి ఉండేద‌ని, అందుకే ట్రైల‌ర్ లో మేం కాన్సెప్ట్ చెప్పాల‌నుకున్నామ‌ని, కానీ ఆ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌లేద‌ని అనిల్ చెప్పారు. 1 నేనొక్క‌డినే కంటే ముందే మ‌హేష్ తో తాను దూకుడు సినిమా చేశాన‌ని, 1 నేనొక్క‌డినే సినిమా దూకుడు రికార్డుల‌ను కూడా బ్రేక్ చేస్తుంద‌ని భావించామ‌ని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాపైనా ఆ మూవీ ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ ను ఎంత‌గానో మెప్పించ‌ద‌న్నారు.