నిర్మాత అనిల్ కూడా సూపర్ హిట్టే..!
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నారి నారి నడుమ మురారి.
By: Ramesh Boddu | 19 Jan 2026 12:13 PM ISTఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో మెగాస్టార్ డామినేషన్ తెలిసిందే. మన శంకర వరప్రసాద్ సినిమాను మెగా ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్న విధానం చూస్తుంటేనే ఆ సినిమా వాళ్లకి ఎంత బాగా కనెక్ట్ అయ్యింది అన్నది అర్థమవుతుంది. ఐతే ఈ సంక్రాంతికి రిలీజైన వాటిలో రాజా సాబ్ ఒక్క సినిమాకే కాస్త మిశ్రమ స్పందన వచ్చింది కానీ మిగిలిన సినిమాలన్నిటికీ ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. ముఖ్యంగా అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
భారీ సినిమాలు డిజప్పాయింట్ చేసినా కూడా..
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నారి నారి నడుమ మురారి. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. నిర్మాతగా ఆయన కెరీర్ తొలినాళ్లలో 14 రీల్స్ బ్యానర్ లో భాగస్వామ్యం ఉన్నారు. ఆ టైం లోనే భారీ సినిమాలు నిర్మించారు. ఐతే ఎప్పుడైతే 14 రీల్స్ నుంచి ఆయన బయటకు వచ్చి చిన్న సినిమాలు నిర్మించారో ఆయనకు సక్సెస్ లు వచ్చాయి.
ఐతే మధ్యలో కొన్ని భారీ సినిమాలు ఆయన్ను డిజప్పాయింట్ చేసినా కూడా ఎంటర్టైనింగ్ సినిమాలు నిర్మాత అనిల్ సుంకరకు మంచి లాభాలు తెచ్చి పెట్టాయి. 3 ఏళ్ల క్రితం రిలీజైన సామజవరగమన తో సక్సెస్ అందుకున్న అనిల్ సుంకర మజాకాతో ఒక మోస్తారు అనిపించుకోగా లేటెస్ట్ గా నారి నారి నడుమ మురారితో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్..
ఫెస్టివల్ టైం కాబట్టి శర్వానంద్ సినిమాకు తక్కువ సెంటర్స్ ఇచ్చినా కూడా సినిమా చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే భారీ సినిమాల వల్ల ఆయన ఎంత లాస్ అయినా కూడా చిన్న సినిమాలే అనిల్ సుంకరకి మంచి సక్సెస్ లు అందిస్తున్నాయి. నారి నారి నడుమ మురారి తర్వాత ఆయన నుంచి వచ్చే మీడియం బడ్జెట్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాత అనిల్ సుంకరకి భారీ లాసులు తెస్తే మీడియం బడ్జెట్ తో ఎంటర్టైనింగ్ గా సాగే సినిమాలు మాత్రం ఊహించని ఫలితాలు అందించాయి. సో ఈ నిర్మాత ఇక మీదట ఇలాంటి సినిమాలే మళ్లీ మళ్లీ తీసే అవకాశం ఉందని చెప్పొచ్చు. నారి నారి నడుమ మురారి సినిమాతో శర్వానంద్ కూడా హిట్ ట్రాక్ ఎక్కడని చెప్పొచ్చు. ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కి ఈ సినిమా కాస్త జోష్ తెచ్చి పెట్టింది.
ఏకె ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర నుంచి ఆడియన్స్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆశిస్తున్నారని అర్ధమైంది. అందుకే అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్ లనే సెట్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు.
