Begin typing your search above and press return to search.

NNNMతో ఫుల్ జోష్.. అనిల్ సుంకర కంటిన్యూ చేస్తారా?

అనిల్ సుంకర రూపొందించిన మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకొలేకపోయాయి.

By:  M Prashanth   |   20 Jan 2026 9:16 AM IST
NNNMతో ఫుల్ జోష్.. అనిల్ సుంకర కంటిన్యూ చేస్తారా?
X

టాలీవుడ్‌ నిర్మాత అనిల్ సుంకర గురించి అందరికీ తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పార్టనర్ గా ఎన్నో సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా నారీ నారీ నడుమ మురారి మూవీ రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం.. అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

అంతే కాదు.. వరుస పరాజయాల తర్వాత అనిల్ సుంకర లో నారీ నారీ నడుమ మురారి ఫుల్ జోష్ నింపింది. అయితే విభిన్న కథలతో సినిమాలు నిర్మించే అనిల్ కు కొన్ని చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టినా, మరికొన్ని తీవ్ర నిరాశ మిగిల్చాయి. భారీ బడ్జెట్‌ తో తీసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి.

అనిల్ సుంకర రూపొందించిన మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకొలేకపోయాయి. ఆ మూడు చిత్రాల వల్ల రూ.100 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. వరుసగా వచ్చిన పరాజయాలతో అనిల్ సుంకర నిర్మాతగా కొనసాగగలరా అనే సందేహాలు కూడా తలెత్తాయి. కెరీర్‌ పై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ప్లాన్ మార్చుకున్నారు.

భారీ బడ్జెట్ సినిమాలకంటే, కంటెంట్‌ కు ప్రాధాన్యం ఉన్న కథలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. బడ్జెట్ తోపాటు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ రిజల్ట్ లు అందుకుంటున్నారు. ముందుగా యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సూపర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను సాధించింది.

ఆ తర్వాత సందీప్ కిషన్‌ లీడ్ రోల్ లో నిర్మించిన మజాకా కూడా మెప్పించింది. పెద్ద హిట్ కాకపోయినా, తక్కువ బడ్జెట్ కారణంగా భారీ నష్టాల నుంచి మాత్రం బయటపడింది. ఇప్పుడు తాజాగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి.. అనిల్ సుంకరకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. శర్వానంద్ యాక్టింగ్, కథలోని ఎంటర్టెన్మెంట్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు సినిమాకు బలంగా మారాయి. దీంతో మంచి వసూళ్లు సాధిస్తోంది.

మొత్తానికి వరుసగా నష్టాలు, విమర్శలు ఎదుర్కొని నిలబడగలిగిన నిర్మాతగా అనిల్ సుంకర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అయితే సరైన కథల ఎంపిక, తక్కువ బడ్జెట్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ తో ముందుకు సాగితే, రాబోయే రోజుల్లో ఆయన ఖాతాలో మరిన్ని విజయాలు చేరే అవకాశముంది. మరి ఇప్పుడు ఉన్న జోష్ ను ఆయన కంటిన్యూ చేస్తారో లేదో.. ఎలాంటి సినిమాలు నిర్మిస్తారో అంతా వేచి చూడాలి.