Begin typing your search above and press return to search.

అనిల్ సుంకర నెక్స్ట్.. వెల్కమ్ అదిరింది!

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర గురించి అందరికీ తెలిసిందే. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు

By:  M Prashanth   |   26 Jan 2026 11:52 PM IST
అనిల్ సుంకర నెక్స్ట్.. వెల్కమ్ అదిరింది!
X

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర గురించి అందరికీ తెలిసిందే. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ముందు పలు చిత్రాలు నిర్మించిన అనిల్ సుంకర.. ఆ తర్వాత నుంచి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై మూవీలు నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్ గా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మూవీతో మంచి హిట్ అందుకున్నారు.

ఆ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అలా నారీ నారీ నడుమ మురారి మూవీతో హిట్ కొట్టిన అనిల్ సుంకర.. ఆ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. అందుకే సరైన ప్లాన్ తో ముందుకెళ్లాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా కొత్త టాలెంట్ కు కల్పించాలన్న లక్ష్యంతో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎయిర్‌ ఫోర్స్ – బెజవాడ బ్యాచ్ టైటిల్ తో మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు.

ఏటీవీ ఒరిజినల్స్ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఆ సినిమా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. నలుగురు నిరుద్యోగ యువకుల ప్రయాణమే మెయిన్ ఎలిమెంట్ గా తెలుస్తోంది. దానికి ఎంటర్టైనెంట్ జోడించి సినిమా తీస్తున్నట్లు సమాచారం. స్నేహం, ఆశయం, పట్టుదలతో తమ జీవితాలను మార్చుకోవాలనుకునే యువత స్టోరీతో సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ యాక్టర్ ను వినూత్నంగా పరిచయం చేశారు మేకర్స్. అందరి దృష్టిని ఆకర్షించారు. విజయవాడలోని ఓ జంక్షన్ లో ప్రత్యేకంగా రూపొందించిన బ్యానర్ ను ఏర్పాటు చేసిన ఎయిర్‌ ఫోర్స్ – బెజవాడ బ్యాచ్ మేకర్స్.. తమ సినిమాకు సంబంధించిన ఫస్ట్ యాక్టర్ కు వెరైటీగా వెల్కమ్ చెప్పారు. అంతే కాదు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రైటప్ ఇప్పుడు కామెడీగా ఉండి ఆకట్టుకుంటోంది.

"అమెరికాకు వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ ను మర్చిపోకండి రా… ఏదో ఒక పని చేసుకోండి అని సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న మా అర్జున్‌ కు స్వాగతం!" అనే రైటప్ నవ్వులు పూయిస్తోంది. సినిమాకు కావాల్సిన బెజవాడ టచ్‌ ను బ్యానర్ కు మేకర్స్ ఇచ్చారు. అంతే కాదు.. యూత్ జోష్, ఫ్రెండ్ షిప్, బెజవాడ లోకల్ కల్చర్.. మూవీలో కీలకంగా ఉండబోతున్నాయని బ్యానర్ చెప్పకనే చెబుతోంది.

అయితే ఒక్క బ్యానర్ తోనే సినిమాపై ఆసక్తి పెరిగిందని చెప్పాలి. ఇది కేవలం ఓ మూవీ కాదు.. కొత్త టాలెంట్ కు వేదిక, నిజమైన కలలకు అండగా నిలిచే ప్రయత్నం అని ఇప్పటికే నిర్మాతలు స్పష్టం చేశారు. స్టోరీ, పాత్రలు, ప్రెజెంటేషన్ అన్నీ కొత్తదనంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మరి ఎయిర్‌ ఫోర్స్ – బెజవాడ బ్యాచ్ మూవీ ఎలాంటి అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.