Begin typing your search above and press return to search.

'రావిపూడి' దీ గ్రేట్.. ఇలాంటి జర్నీ నెవ్వర్ బిఫోర్..

టాలీవుడ్‌లో ప్లాప్ లేని దర్శకుల జాబితా తీస్తే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆ అరుదైన జాబితాలో టాప్ లిస్టులో నిలిచే వ్యక్తి అనిల్ రావిపూడి.

By:  M Prashanth   |   24 Jan 2026 3:02 PM IST
రావిపూడి దీ గ్రేట్.. ఇలాంటి జర్నీ నెవ్వర్ బిఫోర్..
X

టాలీవుడ్‌లో ప్లాప్ లేని దర్శకుల జాబితా తీస్తే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆ అరుదైన జాబితాలో టాప్ లిస్టులో నిలిచే వ్యక్తి అనిల్ రావిపూడి. సరిగ్గా పదేళ్ల క్రితం 'పటాస్' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అనిల్, నేడు మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి ఇండస్ట్రీ హిట్ వరకు ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. 10 ఏళ్ల కాలంలో 9 సినిమాలు తీసి, తొమ్మిదింటిని బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలబెట్టడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. కామెడీని, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా ప్రజెంట్ చేయడంతో ఆయనకు ఆయనే సాటి.

అనిల్ రావిపూడి కెరీర్ గ్రాఫ్ గమనిస్తే, ప్రతి సినిమా ఒక మైల్ స్టోన్ తరహాలో కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణతో చేసిన 'భగవంత్ కేసరి' కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇక వెంకటేష్‌తో చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా వారి ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదాన్ని పంచుతూ, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం అనిల్ మార్క్ స్టైల్.

దర్శకుడిగా రావిపూడి మొదటి హ్యాట్రిక్ 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' సినిమాలతో పూర్తయింది. ఆ తర్వాత వచ్చిన 'F2' కెరీర్‌ను మలుపు తిప్పింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అనిల్‌కు మరింత దగ్గర చేసింది. వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', ఆపై 'F3' చిత్రాలతో తన రెండో హ్యాట్రిక్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.

కథలో ఎంత ఎమోషన్ ఉన్నా, అది సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వినోదాత్మకంగా చెప్పడమే అనిల్ సక్సెస్ సీక్రెట్.

కేవలం వెండితెరపైనే కాదు, ప్రమోషన్ల విషయంలో కూడా అనిల్ రావిపూడిని 'కింగ్' అని పిలుస్తుంటారు. ఒక సినిమాను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, ఏ రకమైన పబ్లిసిటీతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచాలి అనే విషయంలో ఆయనకు పక్కా ప్లానింగ్ ఉంటుంది.

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా ఇద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడంతో, ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయనతో పనిచేయడానికి ఇప్పుడు ప్రతి అగ్ర హీరో ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా దర్శకులు సక్సెస్ ట్రాక్‌లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేసి ఒక్కోసారి దెబ్బ తింటుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అవ్వలేదు.

ప్రతి స్టార్ హీరోతోనూ ఆ హీరో కెరీర్ లోనే గుర్తిండిపోయే హిట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. 10 ఏళ్లలో తొమ్మిది సినిమాలు తీయడం ఒక ఎత్తైతే, ఆ తొమ్మిదింటిని బ్లాక్‌బస్టర్లుగా నిలబెట్టడం మరో ఎత్తు. ఏ పాయింట్ తీసుకున్నా దానికి కమర్షియల్ హంగులు అద్ది సక్సెస్ చేయడం ఆయనకే చెల్లింది.

ఇప్పుడు అందరి దృష్టి అనిల్ రావిపూడి 10వ సినిమాపైనే ఉంది. ఈ దర్శకుడు తన పదో కథ కోసం ఏ హీరోని సెలెక్ట్ ఎంచుకుంటారు? ఏ జోనర్‌లో సినిమా తీయబోతున్నారు? అనేది ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాప్ స్టార్ల డేట్స్ కోసం అనిల్ రావిపూడి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.