Begin typing your search above and press return to search.

రావిపూడి నెక్స్ట్.. అప్పుడే డీల్ కంప్లీట్ అయిందా?

టాలీవుడ్‌ లో సంక్రాంతి సీజన్ అంటే దర్శకుడు అనిల్ రావిపూడి పేరు తప్పకుండా గుర్తొస్తుంది.

By:  M Prashanth   |   13 April 2026 6:50 PM IST
రావిపూడి నెక్స్ట్.. అప్పుడే డీల్ కంప్లీట్ అయిందా?
X

టాలీవుడ్‌ లో సంక్రాంతి సీజన్ అంటే దర్శకుడు అనిల్ రావిపూడి పేరు తప్పకుండా గుర్తొస్తుంది. వరుస హిట్లతో హిట్ మెషీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కనున్న ఆ కొత్త సినిమా ఇప్పటికే హాట్ టాపిక్‌ గా మారింది.

ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోగా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఆ చిత్రానికి సంబంధించిన డైలాగ్ వెర్షన్ ఫస్ట్ హాఫ్ పూర్తయిందని సమాచారం. అనిల్ రావిపూడి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఎంటర్టైనింగ్ నేరేషన్‌ తో స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నెలల్లో ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్ షూట్ మొదలైన తర్వాత వేగంగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి గత చిత్రాలు కూడా సంక్రాంతి సీజన్‌ లోనే విడుదలై భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో.. ఆ సినిమాపై కూడా అదే రేంజ్‌ లో అంచనాలు పెరుగుతున్నాయి.

అయితే ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఆ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు చర్చ జరుగుతోంది. ఓవర్సీస్, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్టు సమాచారం. ఇది సాధారణంగా స్టార్ హీరోల పెద్ద సినిమాలకు మాత్రమే జరుగుతుంటే, రావిపూడి తదుపరి సినిమా విషయంలో ముందుగానే ఈ స్థాయి డిమాండ్ రావడం విశేషం.

ఇది అనిల్ రావిపూడి మార్కెట్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో మరోసారి నిరూపిస్తోందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆ డీల్‌ కు ప్రధాన కారణమని చెబుతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కూడా సినిమాకు మరింత క్రేజ్ తీసుకువస్తోంది. ఇద్దరు విభిన్న శైలిలో నటించే హీరోలు కలిసి నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇమేజ్ కలిస్తే.. సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌ గా నిలుస్తుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. మొత్తానికి, షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ బిజినెస్ సాధించిన ఆ ప్రాజెక్ట్.. విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి రేసులో ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.