Begin typing your search above and press return to search.

హిట్‌మెషీన్‌ని బాగా క‌ష్ట‌పెట్టిన సినిమాలివా?

అలాంటి క‌ష్ట‌మైన, త‌న‌ని క‌ష్ట‌పెట్టిన సినిమాలు ఉన్నాయ‌ట హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కెరీర్‌లో.

By:  Ravindar Gorantla   |   7 April 2026 5:00 AM IST
హిట్‌మెషీన్‌ని బాగా క‌ష్ట‌పెట్టిన సినిమాలివా?
X

కొంత మంది కెరీర్‌లో ఎన్ని చేసినా క‌ష్ట‌త‌ర‌మైన‌వి కొన్ని ఉంటుంటాయి. అలాంటి క‌ష్ట‌మైన, త‌న‌ని క‌ష్ట‌పెట్టిన సినిమాలు ఉన్నాయ‌ట హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కెరీర్‌లో. స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి త‌రువాత అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మాత్ర‌మే. `ప‌టాస్‌` నుంచి ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సినిమాల‌ని రూపొందించారు. ఇందులో ప్ర‌తి సినిమా సూప‌ర్ హిట్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకున్నావే.

ఎఫ్ 2తో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు తెర‌లేపిన అనిల్ రావిపూడి స‌రిలేరు నీకెవ్వ‌రు, సంక్రాంతికి వ‌స్తున్నాం, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌పాద్ గారు` వంటి సినిమాల‌తో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా స‌రికొత్త ట్రాక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీని జోడించి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వ‌రుస‌గా ఇప్ప‌టి వ‌రకు 9 సినిమాలతో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు.

అయితే ఈ తొమ్మిది సినిమాల్లో అనిల్ రావిపూడిని అత్యంత క‌ష్టంగా అనిపించిన సినిమాలు రెండు అని అట‌. ఈ విష‌యాన్ని ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ స్వ‌యంగా ఆయ‌నే అంగీక‌రించారు. ప్ర‌తి సినిమాకు స్ట్ర‌గుల్ అనేది ఉంటుంది. అయితే నాకు కాంప్లీకేటెడ్‌గా అనిపించిన సినిమా `భ‌గ‌వంత్ కేస‌రి` స్క్రిప్ట్‌. ఇందులో ఫన్ త‌క్కువ.. చాలా డ్రామా ఉంటుంది. సోష‌ల్ కంటెంట్ ఉంది. విల‌న్ కాన్‌ఫ్లిక్స్ అందులో మ‌ళ్లీ ఫ్లాష్ బ్యాక్‌. కొద్దిగా వెయిట్ ఉన్న క‌థ‌. భ‌గ‌వంత్ కేస‌రి క‌థ‌లో లోడ్ ఎక్కువ ఉంటుంది.

`స‌రిలేరు నీకెవ్వ‌రు` క‌థ కూడా అంతే. ఈ రెండు క‌థ‌లు బాగా లోడ్ ఎక్కువ ఉన్న క‌థ‌లు. ఈ రెండు నాకు కొంచెం ట‌ఫ్ అనిపించాయి. అయితే మిగ‌తావ‌న్నీ లైట‌ర్ వేన్ స్క్రిప్ట్స్ బ‌ట్ ట్రీట్మెంట్ క‌ష్టంగా ఉంటాయి. అయితే భ‌గ‌వంత్ కేస‌రి, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు క‌థ క‌ష్టంగా ఉంట‌ది ట్రీట్మెంట్ చాలా క‌ష్టం. కానీ మిగ‌తావి అలా కాదు. మిగ‌త క‌థ‌లు కామెడీ ప్ర‌ధానంగా సాగివి అయితే దేని క‌ష్టం దానిదే కానీ భ‌గ‌వంత్ కేస‌రి, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు మాత్రం లోడ్ ఎక్కువున్న‌వి కావ‌డంతో కొంత క‌ష్టంగా అనిపించాయి` అన్నారు.

ఈ రెండు సినిమాల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` సినిమా సామాజిక అంశం నేప‌థ్యంలో రూపొందిన మూవీ కాగా, `స‌రిలేరు నీకెవ్వ‌రు` దేశ భ‌క్తి ప్ర‌ధానంగా రూపొందిన సినిమా. ఇందులో `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ `జ‌న నాయ‌గ‌న్‌`గా రీమేక్ చేయ‌డం తెలిసిందే. జ‌న‌వ‌రిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రాజ‌కీయ వివాదం కార‌ణంగా రిలీజ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.