Begin typing your search above and press return to search.

సీనియ‌ర్లు అంతా మెచ్చిన ఒకే ఒక్క‌డు!

ఇండ‌స్ట్రీలో స‌క్స‌స్ ఓవ‌ర్ నైట్ లో స్టార్ ని చేయ‌డం మాత్ర‌మే కాదు. అంత‌కు మించి ఎంత‌టి హైట్స్ అయినా ఎక్కించ‌గ‌ల‌దు.

By:  Srikanth Kontham   |   8 Jan 2026 5:00 PM IST
సీనియ‌ర్లు అంతా మెచ్చిన ఒకే ఒక్క‌డు!
X

ఇండ‌స్ట్రీలో స‌క్స‌స్ ఓవ‌ర్ నైట్ లో స్టార్ ని చేయ‌డం మాత్ర‌మే కాదు. అంత‌కు మించి ఎంత‌టి హైట్స్ అయినా ఎక్కించ‌గ‌ల‌దు. అందుకు యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి చక్క‌టి ఉదాహార‌ణ. విజ‌యం అత‌డికి కొత్తేం కాదు. తొలి సినిమా `ప‌టాస్` తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాలే బ్లాక్ బ‌స్ట‌ర్లే. అప‌జ‌యం అన్న‌దే అత‌డి కెరీర్ లో ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. గ‌త ఏడాది రిలీజ్ అయిన `సంక్రాంతికి వ‌స్తున్నాం `తో ఏకంగా 300 కోట్ల హిట్ నే అందించాడు. ఇలా ఇన్ని ర‌కాల స‌క్సెస్ చూసిన అనీల్ కి విజ‌యం అన్న‌ది చాలా చిన్న మాటే.

డ‌బ్బు, పేరు, ప్ర‌ఖ్యాత‌లు అన్నీ విజ‌యంతోనే వ‌చ్చేసాయి. అనీల్ లాగే చాలా మంది స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కులు ఉన్నారు. కానీ ఆ ఒక్క విష‌యంలో మాత్రం అనీల్ కి ద‌క్కిన క్రెడిట్ మాత్రం ఎంతో ప్ర‌త్యేక‌మనే చెప్పాలి.

సీనియ‌ర్ హీరోలంతా మెచ్చిన ఒకే ఒక్క దర్శ‌కుడిగా ఓ చ‌రిత్ర సృష్టించాడు అనొచ్చు. అనీల్ క‌న్నా గొప్ప ప్ర‌తిభావంతులు, ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు చాలా మంది ఉన్నారు. కానీ సీనియ‌ర్ల నుంచి ప్ర‌శంస‌లందుకున్న ఒకే ఒక్క‌డు మాత్రం అనీల్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ ల‌తో ఒకేసారి ప్ర‌శంస‌లుకున్న ఒకే ఒక్క‌డు అనీల్.

ఈ సీనియ‌ర్స్ లో మిగిలింది కింగ్ నాగార్జున ఒక్క‌రే. అనీల్ త‌దుప‌రి సినిమా నాగార్జున‌తోనే ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగ్ స‌ర్ తో ప‌నిచేస్తే సీనియ‌ర్లు అంద‌ర్నీ పూర్తి చేసిన వాడిన‌వుతాన‌ని అనీల్ కూడా అనేసాడు. దీంతో అనీల్ -నాగ్ కాంబినేష‌న్ ఖాయ‌మైన‌ట్లే. నిన్న‌టి రోజున చిరంజీవి విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని ఉంద‌ని ఓపెన్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ గా కూడా అనీల్ ని క‌న్ప‌మ్ చేసారు. అదీ ఇప్ప‌టికిప్పుడు సాధ్య‌ప‌డ‌క‌పోయినా? అనీల్ త‌లుచుకుంటే ఏడాదిలో సాధ్య‌మే.

ఇక `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` బ‌క్సాఫీస్ టార్గెట్ ప్ర‌త్యేకంగా ఫిక్స్ అవ్వ‌లేదు. ఎందుకంటే ఇది రీజ‌నల్ సినిమా కావ‌డంతో ప్ర‌త్యేక‌మైన ఫిగ‌ర్ లేదు. కానీ అనీల్ గ‌త సినిమా `సంక్రాంతికి వ‌స్తున్నాం` రీజ‌న‌ల్ గానే రిలీజ్ అయి 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి సినిమా 500 కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంది? అంచ‌నాలున్నాయి.సినిమాలో విక్ట‌రీ వెంకేట‌ష్ కూడా న‌టించ‌డం అద‌నంగా క‌లిసొచ్చిన అంశం. మ‌రి ఈ అంచ‌నాలను అందుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి.