Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. వెంకటేష్ తో నందమూరి హీరో ఫిక్స్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మిషన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

By:  Madhu Reddy   |   27 Feb 2026 7:00 AM IST
అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. వెంకటేష్ తో నందమూరి హీరో ఫిక్స్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మిషన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా 'పటాస్' సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని అటు కళ్యాణ్ రామ్ కి కూడా మంచి కమర్షియల్ విజయాన్ని అందించారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. గత ఏడాది వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. పైగా ఈ ఏడాది చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేసి మరో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇందులో వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా మళ్లీ వెంకటేష్ తో ఏకంగా ఐదవ సారి జత కడుతున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్ చిత్రాల తర్వాత వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి చేస్తున్న ఫుల్ లెంగ్త్ చిత్రం కావడం గమనార్హం. ఇకపోతే వెంకటేష్ అతిథి పాత్ర పోషించిన 'మన శంకర వరప్రసాద్ గారు' తో కలుపుకుంటే మొత్తం వెంకటేష్ తో నాలుగు చిత్రాలు చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ వెంకటేష్ తో ఐదవ చిత్రం చేయడానికి సిద్ధమైపోయారు.

2027 సంక్రాంతి టార్గెట్ గా వెంకటేష్ తో సందడి చేయడానికి సిద్ధం అయిపోయారు. అయితే ఈసారి వెంకటేష్ తో పాటు మరో హీరో ఎవరు నటిస్తారు అని గత కొన్ని రోజులుగా వార్తలు రాగా.. ఏకంగా నందమూరి హీరోని రంగంలోకి దింపేశారు. తాజాగా అనిల్ రావిపూడి , వెంకటేష్ కాంబోలో రాబోయే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో.. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నటించడానికి సిద్ధమయినట్లు రివీల్ చేశారు. ఇకపోతే బ్లాక్ బస్టర్ మూవీ 'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి చేస్తున్న రెండవ చిత్రం కావడం విశేషం.

ఇకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి అటు వెంకటేష్ ఇటు కళ్యాణ్ రామ్ లను కలిపి ఒక ఉత్తేజకరమైన వీడియో క్లిప్ ను ఎంటర్టైనర్ గా చూపిస్తూ విడుదల చేశారు. ఆడియన్స్ ను కనెక్ట్ చేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ సినిమాకి మరింత ప్లస్ కానుంది. హాస్యం, భావోద్వేగం, ఫ్యామిలీ కలగలిపిన మేళవింపుతో ఈ చిత్రాన్ని తరిగి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. మొత్తానికి అయితే మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి.. అంతకు మించిన బ్లాక్ బస్టర్ కాంబోని అనిల్ రావిపూడి సెట్ చేశారు.. మరి తన మార్క్ స్ట్రాటజీతో ఈ సినిమాతో ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.