తొమ్మిది కాదు..99 సినిమాలు తీసినా అలాగే!
హిట్ మెషిన్ అనీల్ రావిపూడి సక్సెస్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ తొమ్మిది సినిమాలు డెరెక్ట్ చేసాడు.
By: Srikanth Kontham | 26 Jan 2026 9:34 AM ISTహిట్ మెషిన్ అనీల్ రావిపూడి సక్సెస్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ తొమ్మిది సినిమాలు డెరెక్ట్ చేసాడు. తొమ్మిది సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. పాన్ ఇండియాలో రాజమౌళి సంచలనమైతే? రీజనల్ మార్కెట్ లో రావిపూడి మరో సంచలనం. ఇన్ని విజయాలు సాధించిన డైరెక్టర్ కి సహజంగా విజయ గర్వం ఉంటుంది. తానో సూపర్ స్టార్ గా ఫీలైనా చెల్లుతుంది. ఎందుకంటే సక్సెస్ అన్నది ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ అనీల్ రావిపూడిలో విజయ గర్వం అన్నది ఇసుమెత్తు కూడా లేదు. అసలు గర్వం అనే పదమే అనీల్ కు తెలియదేమో అనిపిస్తుంది.
సాక్షాత్తు ఓ జర్నలిస్టే అనీల్ ని చూసి ఈ విషయాలన్నీ రివీల్ చేసాడు. ఇన్ని సక్సెస్ లు వచ్చినా? ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు? రెండు మూడు విజయాలు వచ్చిన డైరెక్టర్లే సూపర్ డైరెక్టర్లగా ఫీలైపోతారు? అహం, తల బిరుసుతో వ్యవహరిస్తుంటారు. ఎదుట వారిని నువ్వెంత? అన్నట్లు చూస్తారు. కానీ అనీల్ మాత్రం తొమ్మిది బ్లాక్ బస్టర్లు ఇచ్చినా? అలాగే ఉన్నాడు? అంటే దానికి అనీల్ సమాధానం ఏంటో తెలుసా? తొమ్మిది కాదు...99 హిట్లు ఇచ్చినా? సరే తాను అలాగే ఉంటానన్నాడు. తాను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిదన్నాడు.
తాను స్టార్ డైరెక్టర్ గా ఏనాడు ఫీల అవ్వ లేదన్నాడు. అసలు ఆ ఆలోచనే బుర్రలోకి రానివ్వనన్నాడు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా అన్ని రకాల ఇబ్బందులు..కష్టాలు తనకు తెలుసునన్నాడు. ఇప్పటికీ తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే కారు దిగి వాళ్లతో పాటు కబుర్లు , చెప్పి అక్కడే టీ తాగి వస్తానన్నాడు. ఒకరు ఎక్కువ..మరొకరు తక్కువ అనే భావన తనకెప్పుడు ఉండదన్నాడు. మనిషిని మనిషిలా గౌరవించడమే తెలుసునన్నాడు. అనీల్ `పటాస్` తో డైరెక్టర్ గా పరిచమయ్యాడు. ఆ తర్వాత తొమ్మిది సినిమాల్ని డైరెక్ట్ చేసి హిట్లు అందుకున్నాడు.
డైరెక్టర్ గా అతడి గ్రాఫ్ తారా స్థాయికి చేరింది. `పటాస్` సమయంలో ఎలా ఉన్నాడో? ఇప్పటికీ అలాగే ఉన్నాడు. తెలిసిన వారు ఎవరు కనిపించినా జోవియల్ గా మాట్లాడుతాడు. సరదగా అందరితో కలిపిసోతాడు. అనీల్ లో ఈ రెండు లక్షణాలు ఎంతో మందికి దగ్గర చేసాయి. అనీల్ లో ఆ గుణం చూసే ప్రచారమంటే దూరంగా చివరికి లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా దిగొచ్చి ప్రచారం చేసింది.
