రావిపూడి ఎప్పుడూ సక్సెస్ గ్యారెంటీ డైరెక్టరేనా?
టాలీవుడ్ లో ఒక దర్శకుడు వరుస విజయాలు అందుకుంటే ఆయనపై హీరోలు, నిర్మాతల్లో నమ్మకం ఏర్పడుతుంది. ప్రస్తుతం అలాంటి దర్శకుల లిస్ట్ లో టాప్ లో కనిపించే పేరు అనిల్ రావిపూడిది.
By: M Prashanth | 19 Jun 2026 10:00 PM ISTటాలీవుడ్ లో ఒక దర్శకుడు వరుస విజయాలు అందుకుంటే ఆయనపై హీరోలు, నిర్మాతల్లో నమ్మకం ఏర్పడుతుంది. ప్రస్తుతం అలాంటి దర్శకుల లిస్ట్ లో టాప్ లో కనిపించే పేరు అనిల్ రావిపూడిది. కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయన సక్సెస్ ట్రాక్ ను రావిపూడిని ఎప్పటికీ సక్సెస్ గ్యారెంటీ డైరెక్టర్ అని చెప్పవచ్చా అనే చర్చ సాగుతోంది.
అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన సినిమా పటాస్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కామెడీ, ఎంటర్టైనింగ్ స్టోరీలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
అనిల్ రావిపూడితో వర్క్ చేయడానికి హీరోలు ఆసక్తి చూపడానికి మెయిన్ రీజన్స్ లో ఒకటి ఆయన ట్రాక్ రికార్డ్. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి ఫలితాలు సాధించాయి. దీంతో ఆయనతో సినిమా చేస్తే కనీసం ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుందనే అభిప్రాయం నిర్మాతల్లో కనిపిస్తోంది. అదే సమయంలో హీరోలకు కూడా కమర్షియల్ హిట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.
మరో ముఖ్యమైన కారణం ఆయన వర్కింగ్ స్టైల్. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయడంలో అనిల్ రావిపూడి స్పెషల్ కేర్ చూపుతారనే పేరు ఉంది. సాధారణంగా షూటింగ్లు ఆలస్యం కావడం, బడ్జెట్లు పెరగడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ అనిల్ రావిపూడి సినిమాల విషయంలో అలాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని అంతా చెబుతుంటారు.
ఇటీవల వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టును ప్రకటించారు. ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అనిల్ రావిపూడికి తొలి అవకాశాన్ని ఇచ్చింది కల్యాణ్ రామ్ కాగా, వెంకటేష్ తో ఆయన ఇప్పటికే సక్సెస్ ఫుల్ చిత్రాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలు కూడా ఆయనపై ఉన్న నమ్మకంతోనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనుండగా, వాళ్లు కూడా అందుకే ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి గత సక్సెస్ లు దృష్టిలో పెట్టుకుని క్యాస్టింగ్ కూడా సినిమాపై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కు పర్మనెంట్ గ్యారెంటీ ఉండదనేది కూడా వాస్తవం.
ఎంతటి సక్సెస్ ఫుల్ దర్శకుడైనా ఒక స్టేజ్ లో ఫ్లాపులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రేక్షకుల టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఒకప్పుడు పనిచేసిన ఫార్ములా మరోసారి అదే రేంజ్ లో రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకే అనిల్ రావిపూడి గత ట్రాక్ రికార్డు ఆధారంగా ఆయనను ప్రస్తుతం సక్సెస్ గ్యారెంటీ డైరెక్టర్ గా చెప్పవచ్చు.
కానీ ప్రతి సినిమా విజయం సాధిస్తుందని ముందుగానే డిసైడ్ చేయడం మాత్రం కష్టం. కథ, ప్రేక్షకుల రెస్పాన్స్ వంటి అనేక అంశాలపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలకు అత్యంత నమ్మకం కలిగిస్తున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరనే విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది.
