సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ లేనట్టేనా.. అనిల్ ఏమన్నారంటే?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి.
By: Madhu Reddy | 23 Jan 2026 6:18 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి అనిల్ రావిపూడి గత ఏడాది వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ సినిమా అందించిన సక్సెస్ తో అదే జోరు మీద ఉన్న అనిల్ రావిపూడి.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.అలాంటి ఈయన వచ్చే సంక్రాంతికి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు రాగా.. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.." ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలివారం నేను కథ కోసం వైజాగ్ వెళ్తున్నాను. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే సీక్వెల్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. దీనికి కారణం.. సీక్వెల్ చేస్తే అది మాకు ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ కూడా అవ్వచ్చు. అందుకే నేను సీక్వెల్ చేయను. అయితే ఈసారి కూడా కొత్త క్యారెక్టర్స్.. కొత్త సెటప్ తోనే కథ రాయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక కొత్త కథతో మరో ప్రపంచం సృష్టించాలని భావిస్తున్నాను. ఇక నా తదుపరి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించబోతున్నాను" అంటూ స్పష్టం చేశారు అనిల్ రావిపూడి.
ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ లేదని చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సీక్వెల్ తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సీక్వెల్ తో రానని చెప్పి అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశపరిచారు అనిల్ రావిపూడి.
ఇదిలా ఉండగా మరోవైపు అనిల్ రావిపూడి ఒక తరం హీరోలతో సినిమాలు చేసి ఆ రికార్డు అందుకోబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే బాలకృష్ణ , చిరంజీవి, వెంకటేష్ లతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈసారి ఎలాగైనా సరే నాగార్జునతో సినిమా చేసి ఒక జనరేషన్ హీరోలతో పూర్తిగా సినిమాలు చేసిన డైరెక్టర్గా రికార్డు సృష్టిస్తానని తెలిపారు..
మరి నాగార్జున తోనే ఆయన సినిమా చేస్తారా? అనే అనుమానాలు ఇప్పుడు అనిల్ రావిపూడి మాటలు విన్న తర్వాత వ్యక్తమవుతున్నాయి . అయితే దీనిపై అనిల్ రావిపూడి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి నాగార్జున తోనే తన కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టబోతున్నారా? లేదా అన్న విషయం పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు చెబుతానన్నారు కాబట్టి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అప్పటివరకు ఎదురుచూడాల్సిందే.
