అనిల్ రావిపూడితో అంత ఈజీ కాదు!
సినిమా ఇండస్ట్రీ ఇదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలాంటి టర్న్‌తీసుకుంటారో.. ఎవరు ఎప్పుడు ఎలాంటి స్థాయికి వెళతారో చెప్పడం కష్టం.
By: Tupaki Entertainment Desk | 1 Jan 2026 6:00 AM ISTసినిమా ఇండస్ట్రీ ఇదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలాంటి టర్న్‌తీసుకుంటారో.. ఎవరు ఎప్పుడు ఎలాంటి స్థాయికి వెళతారో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. అలాగే రాత్రికి రాత్రే స్టార్‌లు అయిన వాళ్లూ ఉన్నారు.. అదే తరహాలో తప్పటగులు వేసి తెరమరగైన వారూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉన్న క్రాఫ్ట్‌లో మంచి పట్టుని సాధించి దాన్నే పకడ్బందీగా ఆచరిస్తూ ఎలాంటి ప్రలోభాలకు, ఎలాంటి జిమ్మిక్కులకు లొంగకుండా ముందుకు సాగితే వారి కెరీర్ నల్లేరు మీద నడకే అవుతుంది.
ఈ సూత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఏదైనా తనతో అంత ఊజీ కాదని, దేనికీ తాను ఊజీగా పడనని పిచ్చ క్లారిటీతో చెబుతున్నాడు. రైటర్‌గా కెరీర్ ప్రారంభించి 'పటాస్' మూవీతో డైరెక్టర్‌గా మారి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుని దర్శకుడిగా తన విజయాల పరంపరని కొనసాగిస్తున్నారు. జక్కన్న తరువాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్ట్రైక్ రేట్‌తో సాగుతూ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.
ఫ్యామిలీ అంశాలకు కామెడీని జోడించి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో బ్లాక్ బస్టర్‌లని తన ఖాతాలో వేసుకుంటూ అపజయమెరుగని దర్శకుడిగా ముందుకు సాగుతున్నారు. అయితే అనిల్ లోని చరిష్మా, కామెడీ టైమింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ చూసిన వారంతా ఇప్పుడు ఓ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ తన వెంట పడుతున్నారు. అదేంటంటే కోలీవుడ్ డైరెక్టర్ల తరహాలో మీరు కూడా హీరో మెటీరియల్. అఫ్ కోర్స్ వాళ్లకు మించి మీరే హీరో మెటీరియల్ అని చెబుతూ హీరోగా అరంగేట్రం చేయొచ్చు కాదా అని అడుగుతున్నారట.
సోషల్ మీడియాలోనూ అనిల్ రావిపూడికి ఇదే తరహా ప్రశ్నలు ఎదురువుతున్నాయట. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అనిల్ దీనిపై అందరికి పూర్తిగా స్పష్టతనివ్వాలని డిసైడ్ అయ్యాడు. తన ఆలోచన ఏంటన్నది స్పష్టంగా చెప్పేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలని, మనం ఒక విభాగంలో సూపర్ సక్సెస్‌గా దూసుకుపోతున్నప్పుడు మనల్ని పక్కకి లాగడానికి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా, వాటికి టెమ్ట్ కాకుండా ముందుకు సాగిపోవాలని, పొరపాటున అటు వైపు అడుగేస్తే ఇక అక్కడితో మన పని అయిపోయినట్టేనని చెప్పుకొచ్చాడు.
అంటే డైరెక్టర్‌గా సక్సెస్ ఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ హీరోగా ప్రయత్నించి చేతులు కాల్చుకోవాలనే ఆలోచన తనకు లేదని పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్ గారు' చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోటోంది. 2025 సంక్రాతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్‌ని అందుకున్న అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారు' 2026కు ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
