Begin typing your search above and press return to search.

ప్లానింగ్ విషయంలో ఈ దర్శకుడిని ఎవరు బీట్ చేయలేరా...

సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు.

By:  Gopi Velupala   |   28 Sept 2026 10:15 AM IST
ప్లానింగ్ విషయంలో ఈ దర్శకుడిని ఎవరు బీట్ చేయలేరా...
X

ఒక సినిమాకి కథ రాసుకొని దానిని ప్రొడ్యూసర్లకు, హీరోలకు వినిపించి వాళ్ళను ఒప్పించి అనుకున్న టైమ్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకువచ్చి కమిట్ అయిన డేట్ కి రిలీజ్ చేయడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ ఒక దర్శకుడు తను అనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా ప్రజంట్ చేస్తూ సరిగ్గా తను ఏ డేట్ కి అయితే సినిమాను తీసుకొస్తానని చెబుతున్నాడో అదే డేట్ కి ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నాడు అంటే ఆ దర్శకుడికి ఉన్న ప్లానింగ్ కానీ, కమిట్మెంట్ కానీ చాలా గొప్పదనే చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు. సినిమా స్టార్ట్ అయిన రోజే ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటూ డేట్ ని కూడా అనౌన్స్ చేసి సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి నుంచి ఒక సినిమా రావడం ఆనవాయితీగా మారింది. గత రెండు సంక్రాంతిలకి వరుసగా సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు మూడో సంక్రాంతికి సైతం ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పుడు కనక సక్సెస్ ని సాధిస్తే వరుసగా సంక్రాంతికి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలుస్తాడు... తను ఏదైతే కథను రాసుకుంటాడో దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుడికి నచ్చే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తూనే కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అందువల్లే తను ఈరోజు స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఏది ఏమైనా కూడా వరుసగా తొమ్మిది విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ లను పెట్టి 'జనవరి 12 విడుదల' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2027 జనవరి 12 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో మరోసారి జతకట్టబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నాగార్జునతో కూడా ఒక సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఏ ఒక్కరు కూడా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేయలేదు.

ఒక్క నాగార్జున తో సినిమా చేస్తే అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసిన దర్శకుడిగా అందరికి సక్సెస్ లను సాధించి పెట్టిన దర్శకుడిగా గొప్ప గుర్తింపునైతే తెచ్చుకుంటాడు. మరి నాగార్జునతో ఎలాంటి సినిమా చేస్తాడు ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా మూవీ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...