Begin typing your search above and press return to search.

VenkyAnil5 : వెంకీ చేరికతో టెన్షన్‌ ఫ్రీ..!

అనిల్‌ కి డేట్లు సరిగ్గా ఇస్తే తప్పకుండా అనుకున్న సమయంకు సినిమాను పూర్తి చేస్తాడని చాలా సార్లు నిరూపితం అయ్యింది.

By:  Ramesh Palla   |   7 July 2026 3:11 PM IST
VenkyAnil5 : వెంకీ చేరికతో టెన్షన్‌ ఫ్రీ..!
X

2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి తన సినిమాతో రావడం ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సంక్రాంతి విజేతగా నిలిచిన అనిల్‌ రావిపూడి మరో సంక్రాంతి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌లతో అనిల్ రావిపూడి మూవీని ప్రారంభించాడు. కొన్ని రోజుల క్రితం విభిన్నమైన పబ్లిసిటీతో అనిల్‌ రావిపూడి మూవీ ప్రారంభం అయిందని అందరికీ తెలిసేలా చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిరిగి చూసే విధంగా ఓపెనింగ్‌ కోసం ప్రమోషన్‌ వీడియో చేసిన ఘనత అనిల్‌ రావిపూడికి దక్కింది అనడంలో సందేహం లేదు. సినిమా సంక్రాంతి 2027 కి రావాలి అంటే కచ్చితంగా మూడు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనిల్ కచ్చితంగా సినిమాను పూర్తి చేస్తాడని అంత నమ్మకంగా ఉన్నారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి మూవీ...

అనిల్‌ కి డేట్లు సరిగ్గా ఇస్తే తప్పకుండా అనుకున్న సమయంకు సినిమాను పూర్తి చేస్తాడని చాలా సార్లు నిరూపితం అయ్యింది. కానీ ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో పాటు, వెంకటేష్ ఈ సినిమా మాత్రమే కాకుండా మరో సినిమాను చేస్తూ ఉండటంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్‌ మొదలైంది. రెండు వారాల క్రితమే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్‌ మాత్రమే పాల్గొనడంలో వెంకటేష్‌ రాక గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. వెంకటేష్ మరో వైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షెడ్యూల్‌ కంటిన్యూ అవుతున్నాయి. అదే సమయంలో అనిల్‌ మూవీలోనూ వెంకటేష్ నటించాల్సి వస్తుంది. దాంతో రెండు సినిమాలకు గాను వెంకటేష్ డేట్లు క్ల్యాష్‌ అయ్యే ప్రమాదం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా...

డేట్లు ఇబ్బంది అయితే అనిల్ రావిపూడి సినిమాను పూర్తి చేయడం కష్టం అవుతుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే అనిల్‌ రావిపూడి అన్ని ముందస్తుగానే ప్లాన్‌ చేసుకున్నాడు. వెంకటేష్ మరో సినిమా షూట్‌లో ఉన్నాడనే కళ్యాణ్‌ రామ్‌ పై సోలో సీన్స్ తీయడం జరిగింది. ఇప్పుడు వెంకటేష్ షూటింగ్‌లో జాయిన్‌ కావడంతో కాంబో సీన్స్ షూటింగ్‌ చేస్తున్నాడు. కీర్తి సురేష్‌ సైతం బిజీగా ఉన్న కారణంగా ఆమెతోనూ కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్‌ రామ్‌లతో పాటు ఇద్దరు హీరోయిన్స్‌ కీర్తి సురేష్‌, కృతి శెట్టిలు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన కాంబో సీన్స్‌ షూటింగ్‌ పూర్తి చేస్తారు. కాంబో సీన్స్‌ షూటింగ్‌ పూర్తి చేస్తే ఎవరికి వీలు ఉన్నప్పుడు వారివి సోలో సీన్స్ షూటింగ్‌ పెట్టుకోవచ్చు అని దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేశాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కీర్తి సురేష్‌, కృతి శెట్టి హీరోయిన్స్‌గా...

వెంకటేష్ మొదటి షెడ్యూల్‌ లో జాయిన్‌ కాకపోవడంతో అభిమానులు ముఖ్యంగా అనిల్‌ రావిపూడి సినిమాలను ఇష్టపడే వారు ఆందోళన చెందారు. ఎట్టకేలకు వెంకీ షూటింగ్‌లో జాయిన్‌ అయినట్లుగా అధికారికంగా ప్రకటన రావడంతో అంతా టెన్షన్‌ ఫ్రీ అయ్యారు. అనిల్‌ రావిపూడి మరోసారి తన సినిమాను సంక్రాంతికి తీసుకు రావడం ఖాయం అనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్‌ కి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన అనిల్‌ రావిపూడి, కళ్యాణ్ రామ్‌తోనూ పటాస్‌ రూపొందించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తనకు హిట్ ఇచ్చిన వారితో మరోసారి హిట్‌ సినిమాను చేసేందుకు అనిల్‌ రావిపూడి ఫుల్‌ గా ప్రిపైర్ అయ్యాడు. గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను అనిల్‌ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు బావ బామర్థి పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే టైటిల్‌ను రివీల్‌ చేస్తానంటూ ఆ మధ్య అనిల్ రావిపూడి సన్నిహితుల వద్ద చెప్పాడట.