రీమేక్ రూమర్స్‌కు చెక్… ‘జన నాయగన్’పై అనిల్ రావిపూడి క్లియర్
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్, టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన క్రియేటివ్ విశేషాలను పంచుకున్నారు.
By: Madhu Reddy | 22 July 2026 4:13 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్, టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన క్రియేటివ్ విశేషాలను పంచుకున్నారు.
విజయ్ పిలుపు.. క్లౌడ్ నైన్‌లో అనిల్ రావిపూడి:
‘ది గోట్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ గారు స్వయంగా పిలిచి మాట్లాడటం అనిల్ రావిపూడి సినీ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి. 'భగవంత్ కేసరి' చూసిన విజయ్, అందులోని ఎమోషన్స్, ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించిన సీన్స్‌కి బాగా ఫిదా అయ్యారు. విజయ్ లాంటి సూపర్‌స్టార్ స్వయంగా మెచ్చుకోవడంతో అనిల్ ఎంతో ఉప్పొంగిపోయి, వెంటనే ఈ విషయాన్ని మహేష్ బాబుతో పంచుకున్నారు.
రీమేక్ కాదు.. క్రియేటివ్ ఇన్స్పిరేషన్:
చాలామంది 'జన నాయకుడు' సినిమా భగవంత్ కేసరి రీమేక్ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. కేవలం ఆ సినిమాలో విజయ్‌కి బాగా నచ్చిన కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా 'బనావో బేటీ' కాన్సెప్ట్ లైన్‌ను మాత్రమే తీసుకుని, దాని ఆధారంగా ఒక సరికొత్త కథను రూపొందించారు. ఒక్క సీన్ లేదా ఆలోచన తీసుకున్నా రైట్స్ తీసుకోవాలనే పద్ధతి ప్రకారం కేవీఎన్ ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది.
లీగాలిటీస్ పక్కనపెట్టి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్:
కేవీఎన్ ప్రొడ్యూసర్ వెంకట్ అడిగిన వెంటనే అనిల్ రావిపూడి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఓకే చెప్పారు. "విజయ్ గారికి నా సినిమా నచ్చడమే నాకు పెద్ద అవార్డు, మిగతా ఫార్మాలిటీస్ తర్వాత చూసుకోవచ్చు.. ముందు ఓకే చెప్పేయండి" అని ప్రొడ్యూసర్ సాహుకి చెప్పారట.ఇక ఒక క్రియేటివ్ ఆలోచనను మరొక పెద్ద స్టార్ గుర్తించినప్పుడు దానికి ఇచ్చే గౌరవమిది.
పొలిటికల్ మైలేజ్ ఇచ్చే 'జన నాయకుడు':
విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్న సమయంలో ఈ సినిమా రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో ఉండే సామాజిక కోణం, మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత విజయ్ పొలిటికల్ ఇమేజ్‌కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అందుకే నిర్మాత వెంకట్ కేఎన్ కూడా ఈ సినిమా విజయ్ పొలిటికల్ కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒక తెలుగు సినిమాలోని భావోద్వేగం, కోలీవుడ్ స్టార్‌ను మెప్పించి కొత్త కథకు పునాది వేయడం నిజంగానే అభినందనీయం. రాజకీయంలోకి వెళ్లేముందు విజయ్ ఎంచుకున్న ఈ 'జన నాయగన్' కథనం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కళకు ఎల్లలు లేవు అనడానికి అనిల్ రావిపూడి-విజయ్ ల మధ్య జరిగిన ఈ క్రియేటివ్ బాండింగే ఒక నిదర్శనం.
