రీమేక్ లకు అతడు అందుకే దూరం!
రీమేక్ లను తెరకెక్కించడం కొంత మంది దర్శకులకు ఎంత మాత్రం ఇష్ట ఉండదు.స్ట్రెయిట్ కథలకు వచ్చినంత గుర్తింపు ఇతర రీమేక్ కథలకు పెద్దగా రాదు.
By: Srikanth Kontham | 23 Jan 2026 2:00 PM ISTరీమేక్ లను తెరకెక్కించడం కొంత మంది దర్శకులకు ఎంత మాత్రం ఇష్ట ఉండదు.స్ట్రెయిట్ కథలకు వచ్చినంత గుర్తింపు ఇతర రీమేక్ కథలకు పెద్దగా రాదు. ఒకవేళ సాహసించి చేసినా ఫలితాలు తేడా అయ్యే సరికి నెట్టింట ట్రోలింగ్ తప్పదు. కొంత కాలంగా టాలీవుడ్ కి రీమేక్ లు కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో రీమేక్ లు కూడా తగ్గాయి. రీమేక్స్ లో దర్శకులు సహా పాత్రలు ఫెయిలవుతున్నాయి. హీరోలు కూడా రీమేక్స్ కు ఛాన్స్ తీసుకుంటు న్నారంటే కారణం నచ్చిన కథలు రాకపోవడంతోనే రిస్క్ తీసుకుంటున్నారు. ఇటీవలే హిట్ మెషిన్ అనీల్ రావిపూడికి ఓ స్టార్ హీరోతో రీమేక్ ఆఫర్ వచ్చినా? తానే ముందుకెళ్లలేదు.
ఓ సారి ఆవివరాల్లోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన `జన నాయగన్` అనీల్ రావిపూడి తెరకెక్కించిన `భగవంత్ కేసరి`కి రీమేక్ రూపం. ఆ సినిమా కథ సహా సక్సెస్ చూసిన విజయ్ తమిళ్ లో హెచ్. వినోధ్ తో తో చేతులు కలిపి రీమేక్ చేసాడు. అయితే తొలుత ఈ అవకాశం అనీల్ కే వచ్చింది. విజయ్ అనీల్ నే డైరెక్టర్ చేయమన్నాడు. అంత పెద్ద హీరో అడిగిన తర్వాత డైరెక్టర్ కాదనడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ అనీల్ మాత్రం సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. అందుకు గల కారణాలు మాత్రం రివీల్ చేయలేదు.
తాజాగా ఆ కారణం ఏంటన్నది బయటకొచ్చింది. రీమేక్ లే తగ్గిపోతున్న రోజుల్లో వేరే భాషల్లో తన సినిమాలు రీమేక్ అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేసాడు అనీల్. కానీ ఆ చిత్రాల్ని తననే డైరెక్ట్ చేయమంటే మాత్రం చేయన నేసాడు. ఎందుకంటే ఒకసారి చెప్పిన కథను మళ్లీ చెప్పడం అంటే ఒకే ఇంట్లో మళ్లీ మళ్లీ తిరుగుతున్నట్లు అనిపి స్తుందన్నాడు. కొందరు `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్ ని ఊహిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవన్నారు. భవిష్యత్ లో ఏమవుతుందో చెప్పలేం అన్నాడు. అలాగే తాను తీసే సినిమాలు ఎంటర్ టైనర్లు కావడంతో పాన్ ఇండియా చిత్రాల్లా ఒకేసారి నాలుగైదు భాషల్లో తీయడం సాధ్యం కాదన్నారు.
ఎందుంకటే ప్రాంతాన్ని బట్టి కామెడీ మారిపోతుందన్నారు. అలా కామెడీ ట్రాక్ మార్చడం అంటే ఆమామాషీ కాదు. కాబట్టి అనీల్ కథలు రీమేక్ ఛాన్స్ తీసుకొచ్చు. కానీ పాన్ ఇండియా అటెంప్ట్ లు అన్నవి వర్కౌట్ అవ్వవు. అనీల్ సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ చేసినా? వర్కౌట్ అవ్వవు. రీజనల్ మార్కెట్ ని ఆధారంగా అనీల్ రాసిన కథలు పాన్ ఇండియాకి కనెక్ట్ కావు. యూనివర్శల్ కాన్సెప్ట్ లు మాత్రమే పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతాయి. వీటి మేకింగ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అనీల్ పాన్ ఇండియా సినిమా తీయాలంటే? అతడి స్టోరీలతో పాటు మేకింగ్ విధానం కూడా మారాల్సిందే.
