అంతా పాన్ ఇండియాకి వెళ్లిపోతే అనీల్ నెంబర్1!
రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, చందు మొండేటి, బుచ్చిబాబు ఇలా వీళ్లంతా ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్లగా మారిపోయారు.
By: Srikanth Kontham | 21 Jan 2026 11:00 AM ISTరాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, చందు మొండేటి, బుచ్చిబాబు ఇలా వీళ్లంతా ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్లగా మారిపోయారు. వాళ్లంతా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తు న్నారు. ఇంకా చాలా మంది దర్శకులు పాన్ ఇండియా టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. యూనివర్శల్ కాన్సెస్ట్ తో పాన్ ఇండియా మార్కెట్ కు కనెక్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాధ్ ఇలా వీరంతా కూడా పాన్ ఇండియా కోసం తహతహలాడుతున్న వారే. అవకాశం వస్తే ఏక్షణమైనా జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఇంకా మరికొంత మంది యంగ్ డైరెక్టర్లు కూడా రీజనల్ సినిమా కంటే పాన్ ఇండియా సినిమాకే మొగ్గు చూపుతున్నారు. వీళ్లంతా పాన్ ఇండియాలో బిజీ అయితే గనుక హిట్ మెషిన్ అనీల్ రావిపూడి రీజనల మార్కెట్ లో అతడే నెంబర్ అవుతాడు? అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అతడికి ఆ నెంబర్ ఇచ్చేయోచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీకి అనీల్ ఇచ్చిన సక్సెస్ లు అలాంటివి. తక్కువ బడ్జెట్ లో భారీ లాభాలు ఇచ్చిన కంటెంట్ అతడికి మాత్రమే సాధ్యమైంది. ఇప్పటి వరకూ అతడు తెరకెక్కించిన సినిమాలేవి భారీ బడ్జెట్ తో కూఏడుకున్నవి కాదు.
అంతా కలిపి 50 కోట్లలోపే చుట్టేసిన చిత్రాలు. కానీ బాక్సాఫీస్ వద్ద వాటి వసూళ్లు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాల్లో ఆరు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలే. వాటిలో `సంక్రాంతికి వస్తున్నాం` ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రమిది. అనీల్ కెరీర్ లో టాప్ గ్రాసర్ ఇదే. ఇటీవలే రిలీజ్ అయిన `మనశంకర వరప్రసాద్ గారు` ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ లో ఈసినిమా పాత రికార్డులను బ్రేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇదంతా అనీల్ రీజనల్ మార్కెట్ లో సాధించిన సక్సెస్ మాత్రమే.
హీరోల ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని సింపుల్ స్టోరీలతో తెరకెక్కించి హిట్ ఇచ్చాడు. షూటింగ్ సహా సినిమా రిలీజ్ అన్నది అత్యంత వేగంగా చేయడం అనీల్ ప్రత్యేకత. షూటింగ్ పేరుతో నెలల తరబడి సెట్స్ లో కూర్చోడు. నిర్మాతకు అదనంగా బడ్జెట్ పెంచడు. తాను చెప్పిన బడ్జెట్ లోపే ముగించి అందులోనే నిర్మాతకు కొంత మిగులు స్తాడు. ప్రచారానికి దూరంగా ఉన్న వాళ్లను సైతం తన జోవియల్ గుణంతో ఒప్పించి తీసుకొస్తాడు. పెద్ద పెద్ద స్టార్లను సైతం తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఇన్నీ పాజిటివ్ లక్షణాలున్న అనీల్ రావిపూడి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు.
